బట్టతల బాబులకు బంగారం లాంటి న్యూస్.. మీ పంట పండింది పో.. కొత్త సర్వేలో హెయిర్ గ్రోత్.. జస్ట్..

Taiwanese Hair Growth Serum: తైవాన్‌లోని నేషనల్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేకమైన సీరమ్‌ను తయారు చేశారు. దీన్ని చర్మంపై రాస్తే, కొన్ని వారాల్లోనే మళ్లీ జుట్టు పెరిగిందని పరిశోధనలో తెలిసింది. ఈ సీరమ్ తల చర్మంలోని కొవ్వు కణాలను పనిచేసేలా చేసి, జుట్టు మూలాలను మళ్లీ పుట్టించే శక్తిని కలిగి ఉందని ల్యాబ్‌లో పరీక్షలు చూపించాయి. భవిష్యత్తులో జుట్టు రాలడాన్ని ఆపే చికిత్సలను ఇది పూర్తిగా మార్చేస్తుందని అనుకుంటున్నారు.

  • Published By: Mahesh T ,Published On : October 29, 2025 / 01:13 PM IST
1/12Taiwanese Hair Growth Serum
జుట్టు రాలడం ఆపి, 20 రోజుల్లో కొత్త జుట్టు పెంచుతుందనే కొత్త సీరమ్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
2/12Taiwanese Hair Growth Serum
ఈ ఆవిష్కరణ జుట్టు రాలడం సమస్య ఉన్నవారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే అవకాశం ఉంది.
3/12Taiwanese Hair Growth Serum
తైవాన్‌లోని నేషనల్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఈ వినూత్న సీరమ్‌ను అభివృద్ధి చేశారు.
4/12Taiwanese Hair Growth Serum
ఈ సీరమ్ ఎలుకలపై పరీక్షించగా, కొన్ని వారాల్లోనే వాటికి మళ్లీ జుట్టు పెరిగింది.
5/12Taiwanese Hair Growth Serum
ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో జుట్టు రాలడం నివారించే చికిత్సలను మార్చే అవకాశం ఉంది.
6/12Taiwanese Hair Growth Serum
ఈ సీరమ్ సహజంగా దొరికే కొవ్వు ఆమ్లాలతో (ఫ్యాటీ యాసిడ్స్‌తో) తయారు చేయబడింది.
7/12Taiwanese Hair Growth Serum
ఇది చర్మానికి ఎలాంటి హాని చేయదని, చాలా మృదువుగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
8/12Taiwanese Hair Growth Serum
త్వరలోనే ఇది సాధారణంగా మెడికల్ షాపుల్లో దొరికే అవకాశం ఉందని అంచనా.
9/12Taiwanese Hair Growth Serum
అధిక జుట్టు పెరుగుదలకు కారణమయ్యే 'హైపర్‌ట్రైకోసిస్‌' అనే జీవ ప్రక్రియను బేస్ చేసుకొని ఈ సీరమ్‌ తయారు చేశారట
10/12Taiwanese Hair Growth Serum
ఒలియిక్, పామిటోలియిక్ ఆమ్లాలు: సీరమ్‌లో ఒలియిక్ ఆసిడ్, పామిటోలియిక్ ఆసిడ్ వంటి సహజ కొవ్వు ఆమ్లాలు ఉంటాయి, ఇవి సురక్షితమైనవి.
11/12Taiwanese Hair Growth Serum
పేటెంట్ దాఖలైంది, ఇప్పుడు మనుషులపై పరీక్షలు జరిపి మోతాదు, భద్రతను నిర్ధారించే పనిలో ఉన్నారు.
12/12Taiwanese Hair Growth Serum
ఈ సమాచారం కేవలం తెలుసుకోవడం కోసం మాత్రమే. దీన్ని వైద్య సలహాగా చూడకూడదు. ఏదైనా ట్రీట్మెంట్ కొరకు లేదా మెడిసిన్ యూజ్ కోసం అయితే ముందు డాక్టర్‌ను తప్పకుండా అడగాలి.