Ajit Pawar: ఏది పడితే అది రాస్తారా.. మీడియాపై అజిత్ పవార్ గరంగరం

మోదీ డిగ్రీపై విపక్షాలు హడావుడి చేయడాన్ని అజిత్ పవార్ కొద్ది రోజుల కింద తప్పు పట్టారు. ఇక దీనితో పాటు శరద్ పవార్ సైతం అదానీ అంశంలో విపక్షాలకు షాకిచ్చినట్టుగానే స్పందించారు. దీంతో బీజేపీకి ఎన్సీపీ సానుకూలంగా వ్యవహరిస్తోందంటూ మీడియాలో కథనాలు ప్రారంభమయ్యాయి

Ajit Pawar: ఏది పడితే అది రాస్తారా.. మీడియాపై అజిత్ పవార్ గరంగరం

Ajit pawar

Updated On : April 13, 2023 / 12:53 PM IST

Ajit Pawar: భారతీయ జనతా పార్టీ పట్ల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి సానుకూల దృక్పథం ఏర్పడిందని, అందులో భాగంగానే కొన్ని కార్యక్రమాలకు అజిత్ పవార్ దూరంగా ఉంటున్నారంటూ వచ్చిన వార్తలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండే వ్యక్తుల గురించి ఊహాగానాలతో వార్తలు ఎలా రాస్తారంటూ ఆయన మీడియాను ప్రశ్నించారు. నిర్ధారణ చేసుకోకుండా, కేవలం ఊహాగానాల ఆధారంగా తనపై వార్తలు రావడం చూసి మనస్తాపానికి గురైనట్టు చెప్పారు.

PM Modi : కేంద్ర ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేదు : ప్రధాని మోదీ

షెడ్యూల్ ప్రకారం అజిత్ పవార్ తాజా ఒక కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా, ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. దీనిపై మీడియాలో ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే తన ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని, అంత మాత్రాన ఏదేదో ఊహించుకుని వార్తలు రాస్తారా అంటూ మీడియాపై అజిత్ పవార్ గరంగరం అయ్యారు. వాస్తవానికి మోదీ డిగ్రీపై విపక్షాలు హడావుడి చేయడాన్ని అజిత్ పవార్ కొద్ది రోజుల కింద తప్పు పట్టారు.

Karnataka Polls: ఢిల్లీలో మాజీ సీఎం కిరణ్ కుమార్ వరుస భేటీలు.. కర్ణాటక ఎన్నికల్లో కీలక బాధ్యతలు?

ఇక దీనితో పాటు శరద్ పవార్ సైతం అదానీ అంశంలో విపక్షాలకు షాకిచ్చినట్టుగానే స్పందించారు. దీంతో బీజేపీకి ఎన్సీపీ సానుకూలంగా వ్యవహరిస్తోందంటూ మీడియాలో కథనాలు ప్రారంభమయ్యాయి. కాగా, దీనిపై అజిత్ పవార్ స్పందిస్తూ ‘‘నాకు ఆరోగ్యం బాగోలేదు. దాంతో శుక్రవారం హాజరుకావాల్సిన కార్యక్రమాలు, పర్యటనలు రద్దు చేసుకున్నాను. గత కొద్ది రోజులుగా మహారాష్ట్ర అంతటా తిరుగుతున్నాను. తగినంత విశ్రాంతి దొరకడం లేదు. సరైన నిద్ర కూడా లేదు. దీంతో ఊపిరితిత్తుల సమస్య ఎక్కువగా వచ్చింది. వైద్యుల సలహా మేరకు మందులు వేసుకుని ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది” అని స్పష్టతనిచ్చారు.

AIADMK: గొడవలు సద్దుమణిగాయి.. కేంద్ర మంత్రివర్గంలోకి అన్నాడీఎంకే!

తాము కూడా మనుషులమేనని, తమకు కూడా ఆరోగ్య సమస్యలు సహా ఇతర సమస్యలు ఉంటాయని, వాటిని దృష్టిలో ఉంచుకోవాలని మీడియాను కోరారు. ఇక కొద్ది రోజుల ముందు మోదీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విద్యార్హతలను పలు విపక్ష పార్టీలు టార్గెట్‌గా చేయడాన్ని అజిత్ పవార్ తప్పుపట్టారు. మంత్రుల డిగ్రీలపై ప్రశ్నించడం సరైనది కాదని, ఆ నేతలు తమ పదవీకాలంలో ఏమి సాధించారన్నదే ప్రధానమని అన్నారు. ఆ వెనువెంటనే ఆయన ముందస్తు షెడ్యూల్ ప్రకారం శుక్రవారంనాడు హాజరుకావాల్సిన ప్రోగ్రామ్‌ను రద్దు చేసుకున్నారు. ఫోనుకు కూడా ఆయన దొరకలేదు. దీంతో అజిత్ పవార్ తదుపరి చర్య ఏమిటంటూ మీడియాలో ఊహాగానాలు వెలువడ్డాయి. వీటిపైనే అజిత్ పవార్ శనివారంనాడు మండిపడ్డారు.