ఏపీకి 3 రాజధానులు : అసెంబ్లీ ఆమోదం
3 రాజధానుల బిల్లుకు ఏపీ శాసనసభ అమోదం తెలిపింది. రాజధానిని మూడు ప్రాంతాలకు విస్తరిస్తూ సీఎం జగన్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో మూడు రాజధానుల

3 రాజధానుల బిల్లుకు ఏపీ శాసనసభ అమోదం తెలిపింది. రాజధానిని మూడు ప్రాంతాలకు విస్తరిస్తూ సీఎం జగన్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో మూడు రాజధానుల
3 రాజధానుల బిల్లుకు ఏపీ శాసనసభ అమోదం తెలిపింది. రాజధానిని మూడు ప్రాంతాలకు విస్తరిస్తూ సీఎం జగన్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో మూడు రాజధానుల ప్రతిపాదనకు శాసనసభ పచ్చజెండా ఊపింది. ఈ బిల్లు ప్రకారం పాలనా రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండనుంది. దీంతోపాటు సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లు కూడా ఆమోదం పొందింది. అనంతరం శాసనసభ ఇవాళ్టికి(జనవరి 21,2020) వాయిదా పడింది.
ఓటింగ్ లేకుండానే బిల్లు పాస్:
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఎలాంటి ఓటింగ్ లేకుండానే సభలో బిల్లు పాస్ అయింది. ఈ కొత్త బిల్లు ప్రకారం అమరావతి శాసన రాజధాని, విశాఖపట్నం పరిపాలనా రాజధాని, కర్నూలు జ్యుడీషియల్ కేపిటల్‌గా నిర్ణయిస్తూ ప్రభుత్వం తీర్మానం చేసింది. అనంతరం ఆర్థికమంత్రి బుగ్గన బిల్లును పాస్ చేయాల్సిందిగా స్పీకర్‌ను కోరారు. సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో బిల్లు పాసయినట్లు స్పీకర్ ప్రకటించారు.
అసెంబ్లీ చరిత్రలో చారిత్రాత్మకమైన రోజు:
అంతకుముందు సీఆర్డీఏ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టారు మంత్రి బొత్స. తర్వాత బిల్లును పాస్ చేయాల్సిందిగా స్పీకర్‌ను కోరారు. సభ్యులు కూడా ఆమోదం తెలపండంతో బిల్లు పాసయినట్లు ప్రకటించారు స్పీకర్. ఇక బిల్లులు పాసైన సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం ఉద్వేగానికి లోనయ్యారు. ఈ రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఇది చారిత్రాత్మకమైన రోజుగా నిలిచిపోతుందన్నారు. ఈ గొప్ప నిర్ణయంలో తాను భాగస్వామిని కావడం, బిల్లును సభకు పరిచయం చేసే గొప్ప అవకాశం రావడంతో తన జన్మ ధన్యమైందన్నారు. అనంతరం సభను వాయిదా వేశారు. రెండు బిల్లులు శాసనసభలో ఆమోదం పొందడంతో ప్రస్తుతం అందరి దృష్టి శాసనమండలి మీద ఉంది. మరోవైపు శాసనమండలిలో టీడీపీకి సంఖ్యా బలం ఎక్కువ ఉంది. దీంతో మండలి సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
* 3 రాజధానులు, సీఆర్టీఏ రద్దు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం
* లెజిస్లేటివ్ రాజధానిగా అమరావతి
* అడ్మినిస్ర్టేటివ్ రాజధానిగా విశాఖ
* జ్యుడీషియల్ రాజధానిగా కర్నూలు
* సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం జగన్
* బిల్లులు పాసైన సందర్భంగా ఉద్వేగానికి లోనైన స్పీకర్
Also Read : రాజధాని ఎక్కడికి వెళ్లినా తిరిగి ఇక్కడికే వస్తుంది : పవన్ కళ్యాణ్