జగన్ ప్రభుత్వానికి ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు

సమావేశాల్లో ప్రధానంగా బడ్జెట్ ను ఆమోదించడంతో పాటు ప్రభుత్వం తీసుకున్న ముఖ్య నిర్ణయాలకు సంబంధించిన బిల్స్ కు ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.

జగన్ ప్రభుత్వానికి ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు

AP Assembly Sessions 2024

Updated On : January 30, 2024 / 5:40 PM IST

AP Assembly Sessions 2024 : ఫిబ్రవరి 5 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏపీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వానికి ఇదే చివరి అసెంబ్లీ సమావేశాలు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వేళ అయ్యింది. ఫిబ్రవరి 5 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సెషన్ లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఆమోదించనున్నారు. ఏపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ముందు రానున్న చివరి అసెంబ్లీ సమావేశాలు ఇవే. సంపూర్ణ బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉండదు. దీంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడ్తారు.

Also Read : రాజ్యసభ రేసులో టీడీపీ? టచ్‌లో 30మంది వైసీపీ ఎమ్మెల్యేలు?

ఈ బడ్జెట్ సమావేశాల్లో 3 రోజులు మాత్రమే సభ జరగనుంది. రేపు జరిగే కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించిన నిర్ణయాన్ని కేబినెట్ తీసుకోనుంది. బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా బడ్జెట్ ను ఆమోదించడంతో పాటు ప్రభుత్వం తీసుకున్న ముఖ్య నిర్ణయాలకు సంబంధించిన బిల్స్ కు ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. ఎన్నికల సీజన్ కావడంతో అన్ని పార్టీలకు ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ప్రచారం ముమ్మరం చేయాల్సి ఉంది. దీంతో కాలయాపన చేయకుండా ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే కేవలం మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తే సరిపోతుంది అనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : ఆయన ఆశీస్సులు ఉన్న వారికే ఎమ్మెల్యే టికెట్..! నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థి ఎంపికలో ట్విస్టుల మీద ట్విస్టులు