ఎన్నికల టైం : మార్చి 15న ఢిల్లీకి బాబు

  • Published By: madhu ,Published On : March 14, 2019 / 06:20 AM IST
ఎన్నికల టైం : మార్చి 15న ఢిల్లీకి బాబు

ఎన్నికల వేళ ఏపీ సీఎం బాబు ఢిల్లీకి వెళుతున్నారు. ఆయన టూర్‌పై ప్రాధాన్యత సంతరించుకుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీ ప్యాట్ మెషీన్ల విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వివి ప్యాట్‌లలోని స్లిప్పులను లెక్కించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో బాబు 22 ప్రతిపక్ష పార్టీల నేతల సంతకాలను తీసుకున్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. వివి ప్యాట్‌ యంత్రాల్లో ఓటింగ్ స్లిప్పుల లెక్కింపుపై సుప్రీం విచారణ చేపట్టనుంది. మార్చి 15వ తేదీన విచారణ జరుగుతున్న సందర్భంగా బాబు ఢిల్లీకి వెళుతున్నారు. 
Read Also : యుద్ధానికి సేనాని సిద్ధం : పవన్ కళ్యాణ్ సమర శంఖం

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీతో వేర్వేరుగా బాబు సమావేశమవుతారు. లోక్ సభకు, నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలవుతున్న సందర్భంలో సుప్రీంలో ఈ పిటిషన్ దాఖలు కావడం..విచారణకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈవీఎంల దుర్వినియోగంపై పలు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీనిపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈవీఎంలలో ఫలానా లొసుగులున్నాయంటూ ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఎన్నికల కమిషన్ వాటిని కొట్టిపారేస్తోంది. మరి విచారణ సందర్భంగా సుప్రీం ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందో చూడాలి.