బ్రేకింగ్ : మహిళలకు సున్నా వడ్డీకి రుణాలు-సీఎం జగన్

రాష్ట్రంలో మహిళలకు జీరో పర్సెంట్ వడ్డీకి రుణాలు అందచేస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన దిశపోలీసు స్టేషన్ ప్రారంభించిన అనతరం ఆయన మాట్లాడుతూ….రాష్ట్రంలో అర్హులైన 25 లక్షల మంది మహిళలకు వచ్చే ఉగాది నాటికి ఇళ్ల పట్టాలు రిజిష్ట్రేషన్ చేసి ఇవ్వనున్నామని చెప్పారు. నాడు-నేడు అనే కార్యక్రమంతో స్కూళ్ల రూపురేఖలు మార్చుతున్నామని.. ఇంగ్లీషు మీడియం స్కూళ్లు ద్వారా పిల్లల జీవితాల్లో మలుపు తీసుకు వస్తున్నామని చెప్పారు.
ప్రతి అడుగులోనూ మహిళలకు తమ ప్రభుత్వం తోడుగా ఉంటుందని..మహిళల కోసం 50 శాతంరిజర్వేషన్లు క్రియేట్ చేసి..నామినేటెడ్ పదవుల్లోనూ..నామినేటెడ్ గా ఇచ్చే పనుల్లోనూ మహిళలకు ప్రాధాన్యం ఇచ్చేలా చట్టం తెచ్చామని ఆయన చెప్పారు. అమ్మ ఒడి పధకం ద్వారా 42 లక్షల మంది తల్లుకు ఫించను అందిస్తున్నామని ..తద్వారా 84 లక్షల మంది పిల్లల చదువుకు ఆర్ధిక సాయం అందుతోందని చెప్పారు. ఏపీ మహిళలు ఆర్ధికంగా, సామాజికంగా,రాజకీయంగా బలపరిచేందుకు ఈ శతాబ్దపు భారతీయ మహిళ ఈ ఆంధ్రప్రదేశ్ నుంచే ఆవిర్భవిస్తుందని ప్రకటించారు.