గుంటూరు ఎంపీ స్థానంపై జగన్ ఫోకస్.. ఆ సామాజికవర్గానికి టికెట్ ఇవ్వాలని యోచన

గుంటూరు పార్లమెంటు స్థానంలో ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు వెంకటరమణ పేరును పరిశీలిస్తోంది.

గుంటూరు ఎంపీ స్థానంపై జగన్ ఫోకస్.. ఆ సామాజికవర్గానికి టికెట్ ఇవ్వాలని యోచన

CM Jagan Focus On Guntur MP Seat

Updated On : January 26, 2024 / 8:11 PM IST

CM Jagan : గుంటూరు పార్లమెంటు స్థానంపై వైసీపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈసారి ఎలాగైనా గుంటూరు లోక్ సభ స్థానంలో గెలవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాపు సామాజికవర్గానికి ఈసారి టికెట్ కేటాయించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. గుంటూరు పార్లమెంటు స్థానంలో ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు వెంకటరమణ పేరును పరిశీలిస్తోంది. గుంటూరు మేయర్ కావాటి మనోహర్ నాయుడు పేరు కూడా గుంటూరు ఎంపీ స్థానానికి పరిశీలిస్తున్నట్లు సమాచారం.

గడిచిన ఎన్నికల్లో గుంటూరు ఎంపీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. దీంతో ఈసారి ఎలాగైనా గుంటూరు సెగ్మెంట్ ను తన ఖాతాలో వేసుకోవాలని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన నరసరావుపేట సీటును బీసీ అభ్యర్థికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ పేరును ఖరారు చేశారు. ఇక, గుంటూరు విషయానికి వస్తే కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి ఎంపీ టికెట్ ఇవ్వాలని వైసీపీ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.

Also Read : పొత్తుపై స్వరం మార్చిన పవన్.. తాను చెప్పాల్సింది క్లారిటీగా చెప్పేశారా!

వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు ఉమ్మారెడ్డి వెంకటరమణ లేదా గుంటూరు కార్పొరేషన్ మేయర్ గా ఉన్న కావాటి మనోహర్ నాయుడు.. వీరిద్దరిలో ఒకరికి గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ ఇంఛార్జి బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సర్వేలు చేస్తున్నారు. ఈ ఇద్దరిలో ఒకరిని పార్లమెంటు ఇంఛార్జిగా ప్రకటించి లోక్ సభ ఎన్నికల బరిలో నిలవాలని వైసీపీ యోచిస్తోంది. గడిచిన ఎన్నికల్లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

సిట్టింగ్ ఎంపీగా గల్లా జయదేవ్ ఉన్నారు. ఈసారి ఎలాగైనా ఈ సీటుని కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్న వైసీపీ.. కాపు సామాజికవర్గానికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించింది. గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాపు సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నారు. అందువల్ల కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి గుంటూరు ఎంపీ టికెట్ ఇస్తే కచ్చితంగా ఆ ఎఫెక్ట్ అనేది ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలపైన కూడా ఉంటుందనేది వైసీపీ హైకమాండ్ యోచన.

Also Read : వైఎస్‌ కుటుంబంలో రాజకీయ యుద్ధం.. షర్మిలతో జగన్‌కు చిక్కులు తప్పవా?