TDP Janasena Tickets Sharing Issue : పొత్తు పాట్లు.. ఆ 17 సీట్లలో నువ్వా నేనా అంటున్న టీడీపీ-జనసేన

జనసేనకు కేటాయించిన ఐదు సీట్లలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? పవన్ పోటీ చేసే నియోజకవర్గం ఏది?

TDP Janasena Tickets Sharing Issue : పొత్తు పాట్లు.. ఆ 17 సీట్లలో నువ్వా నేనా అంటున్న టీడీపీ-జనసేన

TDP Janasena Tickets Sharing Issue

Updated On : February 28, 2024 / 3:20 PM IST

TDP Janasena Tickets Sharing Issue : టీడీపీ జనసేన కూటమిలో సీట్ల సర్దుబాటు చిచ్చు రేపుతోంది. తొలి విడత జాబితా విడుదల నుంచి ఈరోజు వరకు అటు టీడీపీ ఇటు జనసేనలో సర్దుబాటు సమస్యగా మారుతోంది. మొత్తం 175 స్థానాల్లో 24 సీట్లతోనే జనసేన సర్దుబాటు చేసుకోవడాన్ని ఆ పార్టీ కేడర్ జీర్ణించుకోలేకపోతోంది. ఇదే సమయంలో తక్కువ సీట్లు, ఎక్కువ మంది ఆశావహుల వల్ల ఎవరికి అవకాశం ఇవ్వాలన్న అంశాన్ని తేల్చలేకపోతోంది జనసేన నాయకత్వం. దీని వల్ల పోటీ చేస్తామన్న 24 స్థానాల్లో కేవలం ఐదు సీట్లకే అభ్యర్థులను ప్రకటించి మిగిలిన 19 స్థానాలు పెండింగ్ లో పెట్టింది. ఇందులో జనసేన పోటీ చేస్తుందని గతంలో ప్రకటించిన రాజోలు కూడా ఉంది.

ప్రస్తుతం ప్రకటించిన 5, రాజోలుతో కలిసి 6 సీట్లపైన మాత్రమే టీడీపీ-జనసేన కేడర్ లో క్లారిటీ ఉంది. అంటే 24ల కేవలం 6 నియోజకవర్గాల్లో మాత్రమే జనసేన పోటీపై స్పష్టత వచ్చింది. రాజోలులో ముగ్గురు అభ్యర్థులు టికెట్ కోసం పోటీ పడుతుండగా.. జనసేనాని పవన్ పోటీపైనా సస్పెన్స్ ఏర్పడింది. మరోవైపు జనసేనకు రాష్ట్రంలో ఏ నియోజకవర్గాలు కేటాయిస్తారు అన్నది ఇప్పటికీ ఉత్కంఠ రేపుతోంది.

ఇదే సమయంలో సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ప్రకటనపై అసమ్మతులు తారస్థాయికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో లొల్లి మరీ ఎక్కువగా ఉంది. జనసేనకు కేటాయించిన ఐదు సీట్లలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? పవన్ పోటీ చేసే నియోజకవర్గం ఏది? జనసేనకు కేటాయించే అవకాశం ఉన్న నియోజకవర్గాలు, అక్కడి పరిస్థితులపై 10టీవీ స్పెషల్ అనాలసిస్..

జనసేనకు దక్కిన ఐదు స్థానాలు..
తెనాలి – నాదెండ్ల మనోహర్ (టికెట్ ఆశించిన టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా) తెనాలిలో నాదెండ్లదే పైచేయి
నెల్లిమర్ల – లోకం మాధవి (టికెట్ ఆశించిన టీడీపీ నేత బంగార్రాజు)- బేషరతుగా జనసేనకు టికెట్ కేటాయించిన టీడీపీ
అనకాపల్లి – కొణతాల రామకృష్ణ (టికెట్ ఆశించిన టీడీపీ కీలక నేత పీలా గోవింద్) (ఇద్దరూ దగ్గరి బంధువులే)
రాజానగరం – బత్తుల రామకృష్ణ (టికెట్ ఆశించిన టీడీపీ నేత వెంకటరమణ చౌదరి) రాజానగరంలో పోటీ చేస్తామని ముందే ప్రకటించిన పవన్ కల్యాణ్
కాకినాడ రూరల్ – పంతం నానాజీ (టికెట్ ఆశించిన టీడీపీ నేత పిల్లి అనంతలక్ష్మి) కాకినాడ రూరల్ సీటు కోసం ముందు నుంచి పట్టుబట్టిన జనసేన

రాజోలు టికెట్ కోసం ముగ్గురి మధ్య తీవ్రమైన పోటీ..
దేవ వరప్రసాద్ (రిటైర్డ్ అధికారి)
రాపాక రమేశ్ బాబు (జనసేన నేత)
బొంతు రాజేశ్వరరావు (జనసేన ఇంఛార్జ్)

Also Read : గోదావరి జిల్లాల్లో పొత్తు చిచ్చు..! సీట్ల సర్దుబాటుపై జనసైనికులకు ఉన్న అభ్యంతరాలేంటి?

పూర్తి వివరాలు..