చంద్రబాబుకు బెయిల్ వస్తుందా? రాదా? సుప్రీంకోర్టులో ఫైబర్ నెట్ కేసు విచారణ.. సర్వత్రా ఉత్కంఠ
ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ విచారణపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ లభిస్తుందా? లేదా? అన్నదానిపై న్యాయవర్గాల్లో చర్చ మొదలైంది.

AP Fiber Net Scam Chandrababu Bail Petition
AP Fibernet Scam : సుప్రీంకోర్టులో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు విచారణ రేపు (జనవరి 17) జరగనుంది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ముందస్తు బెయిల్ ను ఏపీ హైకోర్టు నిరాకరించింది. దీంతో ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు చంద్రబాబు. రేపు చంద్రబాబు పిటిషన్ ను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం విచారించనుంది.
Also Read : టీడీపీ రేసుగుర్రాలు రెడీ..! 72మందితో లిస్ట్..!
17ఏ పైన స్పష్టత వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ కేసును విచారిస్తామని గతంలో సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. 17ఏ పై ఇవాళ తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. దీంతో రేపు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ విచారణపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ లభిస్తుందా? లేదా? అన్నదానిపై న్యాయవర్గాల్లో చర్చ మొదలైంది. ఇప్పటికే చంద్రబాబుపై దాఖలు చేసిన ఇసుక, ఐఆర్ఆర్, మద్యం కేసుల్లో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
చంద్రబాబుకి సంబంధించిన కేసులు సుప్రీంకోర్టులో వరుసగా విచారణకు వస్తున్నాయి. రేపు ఫైబర్ నెట్ కేసు విచారణ జరగనుంది. ఈ కేసుకు సంబంధించి గతంలో అనేకసార్లు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చినప్పటికీ.. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సెక్షన్ 17ఏకు సంబంధించిన తీర్పు పెండింగ్ లో ఉండటంతో ఫైబర్ నెట్ కేసు విచారణ వాయిదా పడుతూ వచ్చింది. రేపు(జనవరి 17) మధ్యాహ్నం 3గంటలకు ఈ కేసు విచారణను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిబ్ బేలా ఎం త్రివేది ధర్మాసనం చేపట్టబోతోంది.
ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన అనుకూల వర్గానికి కాంట్రాక్ట్ ఇచ్చారని, వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి దర్యాఫ్తు జరుపుతున్న సమయంలోనే ముందస్తు బెయిల్ కు చంద్రబాబు అప్లయ్ చేసుకున్నారు. అయితే, బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తీర్పు పెండింగ్ లో ఉన్న కారణంగా ఫైబర్ నెట్ కేసులో ఎలాంటి అరెస్ట్ చేయొద్దని గతంలో ఏపీ సీఐడీకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
Also Read : సెక్షన్ 17ఏ అంటే ఏమిటి.. ఈ సెక్షన్ ఎవరెవరికి వర్తిస్తుంది?
తాజాగా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం రెండు విభిన్న తీర్పులు ఇచ్చింది. ఈ కేసుని సీజేఐకి రెఫర్ చేసింది. దీంతో రేపు ఫైబర్ నెట్ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం ఎటువంటి వ్యాఖ్యలు చేస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది. 17ఏకు సంబంధించి ఇద్దరు న్యాయమూర్తులు భిన్నమైన తీర్పులు ఇచ్చారు కాబట్టి.. ఫైబర్ నెట్ కేసులో యధాతధ స్థితిని కొనసాగించాలని చెబుతారా? లేక చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తారా? అన్న ఉత్కంఠ నెలకొంది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అని, గవర్నర్ అనుమతి తీసుకోలేదని ఏవైతే అంశాలు పేర్కొన్నారు.. ఇవే అంశాలు ఫైబర్ నెట్ కేసుకి కూడా వర్తిస్తాయని సుప్రీంకోర్టులో చంద్రబాబు తరపు లాయర్ సిద్ధార్ధ్ లూద్రా ప్రస్తావించినప్పుడు.. 17ఏపై తీర్పు వచ్చేవరకు ఫైబర్ నెట్ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గతంలో ఏపీ సీఐడీకి సుప్రీంకోర్టు ఆదేశించింది. తాజాగా సెక్షన్ 17 ఏకు సంబంధించి రెండు భిన్నమైన తీర్పులు వచ్చిన నేపథ్యంలో ఫైబర్ నెట్ కేసు విచారణను ముందుకు తీసుకెళ్తారా? లేదా? అన్నదానిపై రేపు మధ్యాహ్నం స్పష్టత రానుంది.
Also Read : ఆ 13 మంది ఎవరు? ఎంపీ అభ్యర్థులపై వైసీపీ ముమ్మర కసరత్తు