టీటీడీ ఈవోగా జేఎస్వీ ప్రసాద్ : అనిల్ కుమార్ సింఘాల్ కు ఉద్వాసన

ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోమవారం సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేసిన ఆయన ఇప్పడు టీటీడీ ఈవో గా జేస్వీ ప్రసాద్ ను నియమిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
అనిల్ కుమార్ సింఘాల్ ను ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమీషనర్ గా నియమించే అవకాశం ఉంది అంటున్నారు. టీటీడీ కొత్త ఈవోగా బాధ్యతలు చేపట్టబోయే జేఎస్వీ ప్రసాద్ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.జేఎస్వీ స్థానంలో ఇప్పటికే సతీష్ చంద్ర అనే మరో అధికారిని నియమించినట్లుగా కూడా సమాచారం.