ఏం చేయడానికి అమరావతి వెళ్లారు : చంద్రబాబుపై నిప్పులు చెరిగిన కొడాలి నాని
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. నమ్మక ద్రోహం చేసిన చంద్రబాబుకు చెప్పులు, రాళ్లు, కర్రలతో ప్రజలు స్వాగతం పలికారని తెలిపారు.

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. నమ్మక ద్రోహం చేసిన చంద్రబాబుకు చెప్పులు, రాళ్లు, కర్రలతో ప్రజలు స్వాగతం పలికారని తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. ఏం చేయడానికి అమరావతికి వెళ్లారని ప్రశ్నించారు. నమ్మక ద్రోహం చేసిన చంద్రబాబుకు చెప్పులు, రాళ్లు, కర్రలతో ప్రజలు స్వాగతం పలికారని తెలిపారు. ఈ మేరకు గురువారం(నవంబర్ 28, 2019) మంత్రి మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో మంగళగిరిలో లోకేష్, ఆ ప్రాంతంలోని ముగ్గురు శాసన సభ్యులను ఓడించినా అక్కడికి వెళ్తే చెప్పులు, రాళ్లు, కర్రలతో దాడి చేసిన ఆ ప్రాంతం ప్రజానీకానికి ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు అమరావతికి వెళ్లగానే నేలకు ముద్దు పెట్టుకున్నారని..ఇప్పటికైనా ఆయనకు జ్ఞానోదయం అయిందని, బుద్ధి వచ్చిందన్నారు. గత ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండగా గ్రాఫిక్స్ లకు ముద్దులు పెట్టుకున్నారని తెలిపారు. సింగపూర్, మలేషియా, ఆంకాంగ్, బ్యాంకాక్ వెళ్లారని చెప్పారు. ఆరు నెలలకు గ్రాఫిక్స్ రిలీజ్ చేసి వాటిని ముద్దులు పెట్టుకున్నారని గుర్తు చేశారు. ప్రజలు గడ్డి పెట్టాక ఇప్పుడు నేలకు ముద్దు పెట్టుకుంటున్నారని..ఇప్పటికైనా జ్ఞానోదయం అయినందుకు సంతోషమన్నారు.
చంద్రబాబు 33 వేల ఎకరాలు ల్యాండ్ అక్విజేషన్ చేశారని, అక్కడ ఎండోమెంట్, ఫారెస్టు, గ్రామ కంటాలకు సంబంధించిన దాదాపు 60 వేల ఎకరాల భూమి ఉందన్నారు. చంద్రబాబు ఇచ్చిన డీపీఆర్ లెక్కల ప్రకారం లక్షా 9 వేల కోట్ల రూపాయలు..అంటే ఎకరానికి 2 కోట్ల రూపాయలను రోడ్లు, డ్రైనేజీ, మంచినీళ్లు, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడానికి, వాటికి సంబంధించి లేఅవుట్లు ఇవ్వడానికి లక్షా 9 వేల కోట్ల రూపాయలు డీపీఆర్ ను రెడీ చేశారని చెప్పారు. రేట్లు పెరిగిన క్రమంలోవాటిని కంప్లీట్ చేసే కొద్ది లక్షా 9 వేల కోట్లు మహా నగరానికి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ తేవడానికికే కావాలన్నారు. మనకు అంత ఆర్థిక స్థోమత ఉందా అన్నారు. ఇప్పటికీ 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని తెలిపారు. ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెట్టేందుకు లక్షా 9 వేల కోట్ల రూపాయలను పదిన్నర రూపాయల వడ్డీకి తెచ్చారని..రాష్ట్రంపై భారం పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు.
అమరావతిని గ్రాఫిక్స్ లో భ్రమరావతిగా సృష్టించి, వాటిని రాష్ట్రమంతా చూపించి, ప్రజలను మోసం చేయాలనే ఉద్ధేశంతో చంద్రబాబు పని చేశారని చెప్పారు. నీచ బుద్ధితో అమరావతిని అడ్డం పెట్టుకుని రాజకీయంగా పది కాలాలపాటు బతకాలనుకున్నాడని విమర్శించారు. 23 సీట్లకు పరిమితం చేశారని చెప్పారు. చంద్రబాబు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాననే భ్రమలో ఉన్నారని.. రోజుకో ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.
చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు..2002లో విజన్ 2020 ప్రకటిస్తే …2003లో నేలకేసి కొట్టారని తెలిపారు. వచ్చే సంవత్సరం విజన్ 2020 వస్తుందని.. కానీ ఆ సంవత్సరం కూడా ఆయన అధికారంలో లేడన్నారు. అధికారం కోసం సొంత మామనే వెన్నుపోటు పొడిచిచారని విమర్శించారు. కాబట్టి చంద్రబాబు చేసినటువంటి తప్పుడు విధానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నడిచే పరిస్థితి లేదన్నారు.
చంద్రబాబు అమరావతి డ్రామాను విజయంతంగా పూర్తి చేశాడని అన్నారు. రాబోయే రోజుల్లో అనేక డ్రామాలు ఆడటానికి సిద్ధంగా ఉంటాడని అన్నారు. చంద్రబాబుకు 70 ఏళ్ల వయస్సు వచ్చిందని, ఆయన అవుట్ డేటెడ్ అయిపోయాడని అన్నారు. ఆయన ఐదేళ్లకు ఉంటాడో పోతాడో తెల్వదన్నారు. ఏదో రకంగా జగన్ ను అబాసుపాలు చేసి, కొడుకు పప్పును తీసుకొచ్చినా సుద్ద పప్పు అయవుతుంది కానీ ఆయనతో ఎలాంటి కార్యక్రమాలు జరుగవన్నారు. చంద్రబాబు ఒళ్లు దగ్గర పెట్టుకుని జగన్ పై విమర్శలు చేస్తే మంచిందన్నారు.
రాష్ట్ర అభివృద్ధి అంటే అమరావతి ఒక్కటేకాదని…రాష్ట్రంలోని 13 జిల్లాలు ముఖ్యమే అన్నారు. 13 జిల్లాలోని బడుగు, బలహీన, పేద వర్గాలతోపాటు ప్రతి ఒక్కరూ అనేక ఆశలతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గెలిపించారని తెలిపారు. వారందరినీ ఏ విధంగా చూస్తామో.. మిగిలిన వారిని కూడా ఆ విధంగానే చూస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఎవరినీ నిర్లక్ష్యం చేసే ప్రసక్తే ఉండదన్నారు.