జగన్ ఊ అంటే.. చంద్రబాబు, లోకేష్ మినహా అందర్నీ తీసుకొస్తా
టీడీపీ నేతలను వైసీపీలో చేర్చుకోవడంపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ నేతలను వైసీపీలో చేర్చుకోవడంపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ నేతలను వైసీపీలో చేర్చుకోవడంపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలను వైసీపీలోకి తెచ్చే బాధ్యతను సీఎం జగన్ తనకు అప్పగిస్తే.. చంద్రబాబు, లోకేశ్ తప్ప.. మిగతా అందరిని వైసీపీలోకి తెస్తానంటున్నారు మంత్రి కొడాలి నాని. తండ్రిలేని అవినాష్‌ను గుడివాడలో పోటీ చేయించి బలిపశువును చేశాడని.. అలాగే వంశీని కూడా బ్ల్లాక్ మెయిల్ చేయాలని చూశారని విమర్శించారు. టీడీపీ కొద్దికొద్దిగా నిలదొక్కుకోవాలంటే…ఎన్టీఆర్ కుటుంబసభ్యులే భాధ్యత తీసుకోవాలన్నారు.
74 ఏళ్ల వయసులో ఉన్న ఎన్ టీఆర్ ను మెడ పట్టి బయటికి గెంటి, ముఖ్యమంత్రి పదవిని తీసుకున్న
దుర్మార్గుడు, దొంగ.. చంద్రబాబు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇలాంటి సన్నాసులను భూస్థాపిత చేయడానికి, అన్న ఎన్ టీఆర్ ఆత్మకు శాంతి చేకూర్చడానికి ప్రయత్నం చేస్తానని అన్నారు.
వల్లభనేని వంశీ తనకు మొదటి నుంచి మంచి మిత్రుడు అన్నారు. వంశీకి తెలుగుదేశంలో కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం అన్నారు. దేవినేని ఉమా లాంటి కొంతమంది చంద్రబాబు చుట్టూ చేరి వేరే వారిని బతకనివ్వరని అన్నారు.