ఏపీలో రాష్ట్రపతి పాలన : బీజేపీ సీక్రెట్ ఆపరేషన్

ఏపీలో రాష్ట్రపతి పాలన రాబోతోందా..? రాష్ట్రపతి పాలనను తెచ్చేందుకు బీజేపీ పావులు కదుపుతోందా..? చంద్రబాబును అధికారంలో లేకుండా చేసి.. రాష్ట్రాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుందా..?

  • Published By: veegamteam ,Published On : January 21, 2019 / 02:28 PM IST
ఏపీలో రాష్ట్రపతి పాలన : బీజేపీ సీక్రెట్ ఆపరేషన్

ఏపీలో రాష్ట్రపతి పాలన రాబోతోందా..? రాష్ట్రపతి పాలనను తెచ్చేందుకు బీజేపీ పావులు కదుపుతోందా..? చంద్రబాబును అధికారంలో లేకుండా చేసి.. రాష్ట్రాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుందా..?

ఏపీలో రాష్ట్రపతి పాలన రాబోతోందా..? రాష్ట్రపతి పాలనను తెచ్చేందుకు బీజేపీ పావులు కదుపుతోందా..? చంద్రబాబును అధికారంలో లేకుండా చేసి.. రాష్ట్రాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుందా..? తాజా పరిణామాలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. రాష్ట్రపతి పాలన తెచ్చేందుకు బీజేపీ నేతలు రాసిన ఓ సీక్రెట్‌ లెటర్‌.. ఈ విషయాన్ని బయటపెడుతోంది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు.. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు రహస్యంగా అందించిన ఓ లేఖ.. టెన్‌టీవీ ఎక్స్‌క్లూజివ్‌గా సంపాదించింది. టీడీపీ నేతల ఆందోళనలు.. కాకినాడలో తనను అడ్డుకున్న బీజేపీ నేతలపై చంద్రబాబు ఆగ్రహంగా చేసిన విమర్శలనే ప్రధానంగా ఈ లేఖలో ప్రస్తావించారు. ఏపీలో పరిస్థితులు.. కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన స్థాయిలో ఉన్నాయంటూ ఆ లేఖలో పేర్కొన్నారు కన్నా లక్ష్మీనారాయణ.

 

* ఏపీలో రాష్ట్రపతి పాలన కోసం బీజేపీ సీక్రెట్ ఆపరేషన్‌
* కడప పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌కు సీక్రెట్‌గా లేఖ ఇచ్చిన కన్నా లక్ష్మీనారాయణ
* ఏపీలో శాంతిభద్రతలు సజావుగా లేవని లేఖలో పేర్కొన్న కన్నా
* కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
* కాకినాడలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన కన్నా
* రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కేంద్రం జోక్యం అవసరమన్న కన్నా
* టెన్‌టీవీ చేతిలో కన్నా రాసిన లేఖ
* రాష్ట్రపతి పాలనపై కీలక వ్యాఖ్యలు చేసిన రాజ్యసభ ఎంపీ జీవీఎల్
* రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు జరగాలని చంద్రబాబుకు ఉబలాటంగా ఉందా? అంటూ జీవీఎల్ ప్రశ్న
* రాష్ట్రపతి పాలన వస్తే చంద్రబాబు లక్షల కోట్ల అవినీతి బయటకు వస్తుందన్న జీవీఎల్‌

 

ఏపీలో బీజేపీ వర్సెస్ టీడీపీ మాటల యుద్ధం నడుస్తోంది. టీడీపీపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు అదే స్థాయిలో కౌంటర్లిస్తున్నారు టీడీపీ లీడర్లు. ప్రధానిని విమర్శిస్తే రాష్ట్రపతి పాలన తప్పదని బీజేపీ నేత జీవీఎల్ హెచ్చరిస్తే.. ఏపీ జోలికి వస్తే… దేశంలోనే బీజేపీ ఉండదని వార్నింగ్ ఇస్తున్నారు టీడీపీ నేతలు.