రాజధానికి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు : మరో బాంబు పేల్చిన మంత్రి

ఏపీలో రాజధాని అంశం మళ్లీ మొదటికి వచ్చింది. రాజధాని అమరావతిపై గందరగోళం మరింత పెరిగింది. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి రాజధాని గురించి

  • Published By: veegamteam ,Published On : September 8, 2019 / 03:49 AM IST
రాజధానికి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు : మరో బాంబు పేల్చిన మంత్రి

Updated On : September 8, 2019 / 3:49 AM IST

ఏపీలో రాజధాని అంశం మళ్లీ మొదటికి వచ్చింది. రాజధాని అమరావతిపై గందరగోళం మరింత పెరిగింది. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి రాజధాని గురించి

ఏపీలో రాజధాని అంశం మళ్లీ మొదటికి వచ్చింది. రాజధాని అమరావతిపై గందరగోళం మరింత పెరిగింది. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి రాజధాని గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ టీడీపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందా? అని ప్రశ్నించారు. ఇతర నిర్మాణాల మాదిరే అమరావతిని తాత్కాలికంగా ఉంచారని, ఏపీ రాజధాని అమరావతి అని చంద్రబాబు అధికారిక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారా? అని నిలదీశారు. గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదో చంద్రబాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు తీరుతో రాజధానికి అడ్రస్ లేకుండా పోయిందని బొత్స మండిపడ్డారు.

ఐదేళ్లలో చంద్రబాబు చేయలేని పనులను, సీఎం జగన్ వంద రోజుల్లో చేసి చూపించారని మంత్రి బొత్స అన్నారు. నాయకుడు ఎలా ఉండాలో జగన్ చూపిస్తున్నారని చెప్పారు. జనసేనాని పవన్ కల్యాణ్ సినిమా ప్రపంచం నుంచి బయటికి వచ్చి మాట్లాడాలని బొత్స సూచించారు. అమరావతిలో రాజధాని వద్దని గతంలో పవన్ అన్నారని, మళ్లీ ఇప్పుడేమో అక్కడే ఉండాలని అంటున్నారని బొత్స మండిపడ్డారు. పవన్ తీరు రోజుకో మాట పూటకో బాటలా ఉందని విమర్శించారు. తుగ్లక్ పాలన అంటే చంద్రబాబుదే అనే విషయం లోకేశ్‌ తెలుసుకోవాలని మంత్రి బొత్స సూచించారు.

అమరావతి విషయంలో టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని బొత్స ఫైర్ అయ్యారు. అమరావతి రాజధాని అని చెప్పి చంద్రబాబు ప్రభుత్వం ఎక్కడైనా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందా అని నిలదీశారు. తనకున్న సమాచారం ప్రకారం అలా జరగలేదన్నారు. ఏదైనా ఒక చట్టం చేశారంటే దానికి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలనే విషయం కూడా చంద్రబాబుకు తెలియదా అని అడిగారు. అమరావతిలో తాత్కాలికంగా భవనాలు కట్టినట్లే అమరావతిని తాత్కాలిక రాజధానిగా చంద్రబాబు పెట్టారని బొత్స అన్నారు. రాజధానికి 5 వేల ఎకరాలు సరిపోతాయని, ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని పవన్ చెప్పలేదా అని బొత్స నిలదీశారు. మంత్రులు ఎలా ఉండాలో, ఎలా పనిచేయాలో పవన్ చెప్పనక్కరలేదన్నారు. పవన్ లా తనకు నటించడం రాదని బొత్స ఎద్దేవా చేశారు.