కోడెలపై ఫిర్యాదులు చేసింది ఎవరు.. ఎన్ని కేసులున్నాయి

టీడీపీ ప్రభుత్వం హయాంలో సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో కోడెల కొడుకు శివరామకృష్ణ, కూతురు విజయలక్ష్మి అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కే-

  • Published By: veegamteam ,Published On : September 18, 2019 / 02:52 AM IST
కోడెలపై ఫిర్యాదులు చేసింది ఎవరు.. ఎన్ని కేసులున్నాయి

Updated On : September 18, 2019 / 2:52 AM IST

టీడీపీ ప్రభుత్వం హయాంలో సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో కోడెల కొడుకు శివరామకృష్ణ, కూతురు విజయలక్ష్మి అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కే-

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి కేసు రాజకీయ మలుపు తిరిగింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కోడెల మృతికి మీరే కారణం అని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. కోడెలపై కేసులు పెట్టి వేధించి అవమానించి చంపేశారని జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. కోడెలది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్య అని అంటున్నారు. దీనికి వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు తీరు వల్లే కోడెల చనిపోయారని అంటున్నారు. అసలు కోడెలపై కేసులు పెట్టింది ప్రభుత్వం కాదన్నారు. టీడీపీ వాళ్లే కేసులు పెట్టారని చెప్పారు. అంతేకాదు.. కోడెలపై జగన్ ప్రభుత్వం 19 కేసులు పెట్టిందని చంద్రబాబు చేసిన ఆరోపణలను ఖండించారు. వాస్తవంగా కోడెలపై నమోదైన కేసులు రెండే అన్నారు.

టీడీపీ ప్రభుత్వం హయాంలో సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో కోడెల కొడుకు శివరామకృష్ణ, కూతురు విజయలక్ష్మి అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కే-ట్యాక్స్, ఉద్యోగాలు, ల్యాండ్‌ కన్వర్షన్ల పేరుతో అమాయకులను నమ్మించి, బెదిరించి డబ్బులు వసూలు చేశారని టీడీపీ నేతలు, టీడీపీ సానుభూతిపరులు, ప్రైవేట్‌ వ్యక్తులు.. ప్రభుత్వం మారాక ఫిర్యాదు చేశారని వైసీపీ నేతలు చెబుతున్నారు. కోడెల తన కుమారుడి షోరూమ్‌లో నిబంధనలకు విరుద్ధంగా అసెంబ్లీ ఫర్నీచర్‌ను ఉంచారని అధికారులు గుర్తించాకే పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు.

ఈ వాస్తవాలను టీడీపీ నేతలు విస్మరించి ఇష్టానుసారం మాట్లాడటం శవ రాజకీయమేనని వైసీపీ నేతలు మండిపడ్డారు. కోడెల చనిపోయాక రాద్ధాంతం చేస్తున్న టీడీపీ ముఖ్య నేతలు.. కోడెల కుటుంబంపై వరుస కేసులు నమోదవుతున్న సమయంలో పెదవి కూడా విప్పలేదన్నారు. వాటిపై స్పందిస్తే ఎక్కడ పార్టీ పరువు, ప్రతిష్టలు దెబ్బతింటాయోనని భయపడ్డారని చెప్పారు. అసెంబ్లీ ఫర్నీచర్‌ వ్యవహారం బయటపడినప్పుడు.. కోడెల పార్టీ పరువును బజారుకీడ్చారని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారని వైసీపీ నేతలు గుర్తు చేశారు. కోడెల తప్పు చేస్తే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సైతం అప్పట్లో చెప్పారని తెలిపారు. అలాంటి వ్యక్తులు ఇప్పుడు.. రూ.2 లక్షల ఫర్నీచర్‌ తీసుకెళ్తే తప్పా అని రాద్దాంతం చేస్తుండటం చూసి ప్రజలు ముక్కున వేలు వేసుకుంటున్నారని మండిపడ్డారు.

కోడెలపై 19 కేసులు పెట్టారని, ఆయన్ను వేధింపులకు గురిచేశారని టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు. వాస్తవానికి కోడెలపై నమోదైంది 2 కేసులు మాత్రమే అని వివరించారు. మిగిలిన కేసులన్నీ కోడెల కుమార్తె, కుమారుడిపై నమోదయ్యాయని తెలిపారు. కె-ట్యాక్స్‌ పేరుతో సొంత పార్టీ నేతలను సైతం దోచుకున్నారని, వారి ఆస్తులను ఆక్రమించారని, సత్తెనపల్లి మండలం వెన్నాదేవి సమీపంలోని వివాదాస్పదంగా ఉన్న 17 ఎకరాల భూమిని కాజేశారని ఆరోపించారు. దీంతో ప్రభుత్వం మారాక ఆ భూమిని సాగు చేసుకుంటున్న టీడీపీ నేత గొడుగుల సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. ఇదే తరహాలో ఓ కాంట్రాక్టు వ్యవహారంలో తనతో కోడెల శివరామ్‌ రూ.5 లక్షలు తీసుకున్నాడని నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల మండలం వడ్లమూడివారిపాలెంకు చెందిన టీడీపీ నేత వడ్లమూడి శివరామయ్య చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారని వైసీపీ నేతలు చెప్పారు.