Chhattisgarh Polls: ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ముందు కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం భూపేష్ బాఘేల్

ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి బాఘేల్‌ను కాంగ్రెస్‌కు అత్యంత ప్రజాదరణ కలిగిన నేతనా కాదా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సీఎం బాఘేల్ సమాధానమిస్తూ ఇద్దరు కాంగ్రెస్ నేతల పేర్లు చెప్పారు. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనకంటే ఎక్కువ ప్రజాదరణ పొందారని అన్నారు

Chhattisgarh Polls: ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ముందు కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం భూపేష్ బాఘేల్

Updated On : June 11, 2023 / 6:40 PM IST

CM Bhupesh Baghel: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. కాగా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ ఓ పెద్ద విషయాన్ని వెల్లడించారు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖం ఎవరిది అని ఆయనను ప్రశ్నించగా.. కేవలం ముఖ్యమంత్రి ముఖంపైనే పోరు జరుగుతుందని బాఘేల్ సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది చివర్లో ఛత్తీస్‌గఢ్‌తో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, తెలంగాణ అసెంబ్లీల ఎన్నికలు జరగనున్నాయి.

Lalu Yadav Birthday: లాలూ ప్రసాద్ యాదవ్ 76వ పుట్టినరోజు సందర్భంగా 76 కిలోల లడ్డూతో సర్‭ప్రైజ్ చేసిన కార్యకర్తలు

‘ఛత్తీస్‌గఢ్ ఓపెన్ మైక్’ అనే పేరుతో ఒక జాతీయ ఛానల్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ పాల్గొని పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ‘‘రాజస్థాన్‌లో ముఖాముఖి ఎవరో అందరికీ తెలుసు. సాధారణంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కేంద్రంగానే ఎన్నికలు ఉంటాయి. అయితే హైకమాండ్ ఎవరిని ప్రకటిస్తుందనేది తెలియదు. మధ్యప్రదేశ్‌లో ఎలా ఉంటుందనేది చూడాలి’’ అని అన్నారు.

కాంగ్రెస్‌కు అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు?
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి బాఘేల్‌ను కాంగ్రెస్‌కు అత్యంత ప్రజాదరణ కలిగిన నేతనా కాదా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సీఎం బాఘేల్ సమాధానమిస్తూ ఇద్దరు కాంగ్రెస్ నేతల పేర్లు చెప్పారు. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనకంటే ఎక్కువ ప్రజాదరణ పొందారని అన్నారు. అయితే ఈ నిర్ణయాన్ని ప్రజలకే వదిలేస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ముఖాన్ని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.