మోడీ ఏ ముఖం పెట్టుకొని గుంటూరుకు వస్తున్నారు : సీఎం చంద్రబాబు 

ప్రధాని మోడీ, వైసీపీ అధినేత జగన్ పై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు.

  • Published By: veegamteam ,Published On : February 9, 2019 / 11:57 AM IST
మోడీ ఏ ముఖం పెట్టుకొని గుంటూరుకు వస్తున్నారు : సీఎం చంద్రబాబు 

ప్రధాని మోడీ, వైసీపీ అధినేత జగన్ పై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు.

నెల్లూరు : విభజన చట్టంలోని హామీలు అమలు చేయని ప్రధాని మోడీ ఏ ముఖం పెట్టుకొని గుంటూరుకు వస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోయినా జీతాలు తీసుకుంటున్నారని విమర్శించారు. జీతాలు తీసుకున్న వారు పని చేయాలా? వద్దా అని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ దొంగలు పనిచేయకుండా డబ్బులు తీసుకోవాలనుకుంటున్నారని మండిపడ్డారు. వారికి పనిమీద భక్తి గానీ, ప్రజలపై నమ్మకం లేదని విమర్శించారు.

చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో ఇళ్లు నిర్మించామన్నారు. నిర్మించిన ఇళ్లకు అన్ని వసతులు కల్పించామని తెలిపారు. ముఖ్యమంత్రిగా తనకు ఏ స్వార్థమూ లేదన్నారు. 27 ఏళ్ల క్రితం చిన్న సంస్థను స్థాపించానని.. ఆ సంస్థలో చిన్న తప్పు కూడా జరుగలేదని చెప్పారు.