మోడీ, అమిత్ షా దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు : సీఎం చంద్రబాబు 

  • Published By: veegamteam ,Published On : January 6, 2019 / 12:30 PM IST
మోడీ, అమిత్ షా దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు : సీఎం చంద్రబాబు 

Updated On : January 6, 2019 / 12:30 PM IST

విజయవాడ : ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. దేశాన్ని నాశనం చేసేందుకు అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. బ్యాంకులను మోసం చేసినాళ్లంతా విదేశాలకు పారిపోయారని పేర్కొన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల్లో కూడా అవినీతి జరిగిందని ఆరోపించారు. తప్పుడు వ్యక్తుల్ని రక్షించడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సామాజిక వర్గాల మధ్య కేంద్రం వైషమ్యాలను సృష్టిస్తోందన్నారు. త్రిబుల్ తలాక్ వ్యవహారంతోపాటు కేరళలోనూ అదేతీరును అవలంభిస్తుందని తెలిపారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లో కేంద్రం చిచ్చు పెడుతుందని మండిపడ్డారు. ముస్లీంలను అణగదొక్కాలని, దెబ్బ తీయాలని ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర హక్కులను కూడా కేంద్రం కాలరాస్తోందని వాపోయారు. ఎదిరించిన ప్రతి రాష్ట్రాన్ని అణగదొక్కడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు. కోడి కత్తి పార్టీ, బీజేపీ ఒక్కటేనని ఎప్పుడో చెప్పానని గుర్తు చేశారు.