మీకు ఇంగ్లీష్ అర్థం కాలేదా : చంద్రబాబుని ప్రశ్నించిన సీఎం జగన్
జీవో నెంబర్ 2430ని చంద్రబాబు చదివారా లేక చదివినా ఇంగ్లీష్ అర్థ కాలేదా అని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు అర్థం కాకపోతే ఏం చేయాలన్నారు.

జీవో నెంబర్ 2430ని చంద్రబాబు చదివారా లేక చదివినా ఇంగ్లీష్ అర్థ కాలేదా అని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు అర్థం కాకపోతే ఏం చేయాలన్నారు.
జీవో నెంబర్ 2430ని చంద్రబాబు చదివారా లేక చదివినా ఇంగ్లీష్ అర్థ కాలేదా అని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. జీవో నెంబర్ 2430 ను రద్దు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తుందన్నారు. జీవోను రద్దు చేయాలని చంద్రబాబు అడగడం అశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. ఈ జీవోలో ఏం తప్పుందో చెప్పాలన్నారు. తప్పుడు వార్తలు రాసినా, జరగనిది జరిగినట్లు రాసినా ఊరక ఉండాలా అన్నారు. న్యాయము ఉండదా అని నిలదీశారు. చంద్రబాబుకు అర్థం కాకపోతే ఎవరూ ఏమీ చేయలేరన్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తికి కనీసం ఇంగిత జ్ఞానం లేదన్నారు.
అంతకముందు ప్లకార్డులు ప్రదర్శించడంపై ఏపీలో అసెంబ్లీలో గొడవ జరిగింది. ప్లకార్డులు లాక్కోవడంపై టీడీపీ నిరసన తెలిపింది. ప్లకార్డులు ఇచ్చేసినా మార్షల్స్ తమపై దాడికి ప్రయత్నించారని టీడీపీ ఆరోపించింది. ఎమ్మెల్యేలతో దారుణంగా వ్యవహరించారని వాపోయారు. అవాస్తవాలు చెప్పి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబును 40 నిమిషాలు సభకు రాకుండా ఆపారని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడితో చీఫ్ మార్షల్ దురుసుగా ప్రవర్తించారని తెలిపారు.