సీఎంగా నేనెందుకు, రాష్ట్రాన్ని మీరే పాలించండి.. ఈసీపై జగన్ ఫైర్
ఏపీ సీఎం జగన్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఫైర్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఈసీ వాయిదా వేయడంపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసీ

ఏపీ సీఎం జగన్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఫైర్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఈసీ వాయిదా వేయడంపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసీ
కరోనా వైరస్ కారణంగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ 6 వారాల పాటు వాయిదా వేయడం వివాదానికి దారి తీసింది. దీనిపై సీఎం జగన్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఎన్నికలను వాయిదా వేయడాన్ని జగన్ తప్పుపట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై జగన్ విరుచుకుపడ్డారు. ఎన్నికలను ఈసీ వాయిదా వేయడంపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసీ తీరుని జగన్ తప్పుపట్టారు. ఈసీ రమేష్ కుమార్ విచక్షణ కోలోపోయారని, ఏకపక్షంగా ఎన్నికలు వాయిదా వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రమేశ్‌కుమార్, చంద్రబాబుది ఒకే సామాజికవర్గం అన్న జగన్.. చంద్రబాబు హయాంలోనే రమేష్ కుమార్ నియమితులయ్యారని గుర్తు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిష్పాక్షికంగా ప్రవర్తించడం లేదన్నారు జగన్. కరోనా వైరస్ సాకుతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసిన ఈసీ రమేశ్‌కుమార్.. చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల బదిలీకి ఆదేశాలు ఇవ్వడాన్ని జగన్ తప్పుపట్టారు. విచక్షణాధికారం పేరుతో ఎన్నికలు వాయిదా వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు వాయిదా వేసే అధికారం ఈసీకి ఎక్కడ ఉందని జగన్ ప్రశ్నించారు. ఎవరినీ సంప్రదించకుండానే, ఎవరి సలహాలు తీసుకోకుండానే రమేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని జగన్ సీరియస్ అయ్యారు. చంద్రబాబు కోసమే ఈసీ ఎన్నికలు వాయిదా వేశారని జగన్ అనుమానం వ్యక్తం చేశారు.
ఈసీపై చర్యలు తీసుకోవాలన్న జగన్:
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాదని సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఈసీకి ఎక్కడుందని జగన్ నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌పై ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకపక్షంగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడంపై గవర్నర్‌కు జగన్ ఫిర్యాదు చేశారు. ప్రభుత్వంతో సంప్రదించకుండానే కమిషనర్ ఎన్నికలు వాయిదా వేశారని.. ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని జగన్ గవర్నర్‌ను కోరారు.
ఎన్నికల కమిషనరే సీఎంగా పని చేయొచ్చు కదా?
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందనే భయంతోనే విచక్షణ అధికారాల పేరుతో ఎన్నికలు వాయిదా వేశారని ఆరోపించారు సీఎం జగన్. విచక్షణ అధికారాల పేరుతో ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తుంటే తాము అధికారంలో ఉండి ఉపయోగం ఏంటని జగన్ ప్రశ్నించారు. ఇక సీఎంగా నేనెందుకు అని జగన్ నిలదీశారు. ఎన్నికల కమిషనరే సీఎంగా పని చేయొచ్చు కదా? అన్నారు. అసలు రాష్ట్రంలో ఎన్నికలు ఎందుకు, ప్రభుత్వం ఎందుకు అని అడిగారు.
* అధికారులకు, కలెక్టర్లకు మెమో జారీ చేయడానికి ఈసీ ఎవరు?
* ఎన్నికల కమిషనరే సీఎంగా పని చేయొచ్చు కదా?
* అసలు రాష్ట్రంలో ఎన్నికలు ఎందుకు, ప్రభుత్వం ఎందుకు
* ప్రజలు ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించి అధికారం ఇచ్చారు
* పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని చెప్పడం ఏంటి?
* రాత్రికి రాత్రే రమేష్ కుమార్ లో మార్పు ఎందుకు వచ్చింది
* స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని భయపడ్డారు
* చంద్రబాబు దారుణమైన పరిస్థితుల్లో పడిపోతానని భయపడ్డారు
* ఎక్కడి నుంచో ఆర్డర్లు వస్తున్నాయి, ఈయన చదువుతున్నాడు
* ఎన్నికలు వాయిదా వేస్తున్నామని కనీసం సలహా అయినా తీసుకోవాలి కదా
* హెల్త్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీతోనైనా ఈసీ రమేష్ మాట్లాడారా?
* ఇష్టం వచ్చినట్టు కలెక్టర్లను, ఎస్పీలను మారుస్తున్నారు
* 14 చోట్ల మాత్రమే చిన్న చిన్న ఘటనలు జరిగాయి
* స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలాంటి ఘటనలు జరగడం మామూలే
* ఎప్పుడైనా గొడవలు జరగకుండా ఎన్నికలు జరిగాయా
* ఎన్నికలు క్లీన్ స్వీప్ చేస్తామని చంద్రబాబు భయపడ్డారు
* వ్యవస్థలను దిగజార్చేలా చంద్రబాబు వ్యవహరించారు
* మార్చి 31లోగా ఎన్నికలు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉందిర
* రాష్ట్రానికి నిధులు రాకుండా చేయాలని చంద్రబాబు చూస్తున్నారు
* తాను మళ్లీ సీఎం కాలేకపోయానని ప్రజలపై చంద్రబాబు కక్ష కట్టారు
* కేంద్రం నుంచి నిధులు రాకుండా అడ్డుకోవడం కోసం కుట్రలు జరుగుతున్నాయి
* ఎన్నికలు వాయిదా వేస్తే సాధించేది ఏమిటి
* ఎన్నికలు జరక్కపోతే 14వ ఆర్థిక సంఘం నిధులు రాకుండా పోతాయి
* ఈసీపై గవర్నర్ కు ఫిర్యాదు చేశాం, ఎంతవరకు వెళ్లాలో అంతవరకు వెళ్లి తీరుతాం
* ఈసీ నిష్పక్షపాతంగా పని చెయ్యాలి