MB Patil : యువకుడి చెంప పగలగొట్టిన ఎమ్మెల్యే, వీడియో వైరల్

MB Patil: మా గ్రామానికి ఏం చేశారు? అని ఎమ్మెల్యేని నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే కోపంతో ఊగిపోయారు. సహనం కోల్పోయిన ఆయన యువకుడిపై చేయి చేసుకున్నారు.

MB Patil : యువకుడి చెంప పగలగొట్టిన ఎమ్మెల్యే, వీడియో వైరల్

MB Patil(Photo : Google)

Updated On : April 23, 2023 / 9:45 PM IST

MB Patil : కర్నాటక ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంబీ పాటిల్ రెచ్చిపోయారు. సహనం కోల్పోయిన ఆయన ఓ యువకుడిపై చేయి చేసుకున్నారు. అంతా చూస్తుండగానే అతడి చెంప పగలగొట్టారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బాబలేశ్వర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంబీ పాటిల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఓ గ్రామానికి వెళ్లారు. అక్కడి స్థానికులతో మాట్లాడుతున్నారు. ఇంతలో స్థానిక యువకుడు.. తమ గ్రామానికి ఏం చేశారు? అని ఎమ్మెల్యేని నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే కోపంతో ఊగిపోయారు. సహనం కోల్పోయిన ఆయన యువకుడిపై చేయి చేసుకున్నారు. రెండు యువకుడి చెంపై కొట్టారు.(MB Patil)

Also Read..Karnataka Polls: యడియూరప్పను హింసించారట.. ఆయన కన్నీళ్లే బీజేపీని ఓడిస్తాయంటున్న డీకే

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోని బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది. ఈ వీడియోను ట్విట్టర్ షేర్ చేసిన బీజేపీ.. గూండాయిజం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని ఆరోపించింది.

ఈ వీడియో ఆధారంగా కాంగ్రెస్ ను టార్గెట్ చేసింది బీజేపీ. తన బాధను పంచుకోవడం, సమస్యలు చెప్పుకోవడమే ఆ యువకుడి పాలటి శాపమైందని, కాంగ్రెస్ ఎమ్మెల్యే అతడిపై దాడి చేశారని బీజేపీ విమర్శలు చేసింది. ఇదే కాంగ్రెస్ అసలు రూపం అని ధ్వజమెత్తింది. సమస్యలు చెప్పుకుంటే.. దాడి చేయడం మాత్రమే కాంగ్రెస్ కు తెలుసు అని బీజేపీ విమర్శించింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే పాటిల్ తన నియోజకవర్గంలోని గ్రామానికి వెళ్లారు. ఆ సమయంలో గ్రామానికి చెందిన యువకుడు.. ఎమ్మెల్యే పాటిల్ ను నిలదీశాడు. మా గ్రామానికి మీరు ఏం చేశారు? ఎలాంటి అభివృద్ది చేశారో చెప్పండి అని ఎమ్మెల్యే పాటిల్ ను అడిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. సహనం కోల్పోయిన ఎమ్మెల్యే పాటిల్.. నన్నే ప్రశ్నిస్తావా అంటూ ఆ యువకుడి చెంప చెళ్లుమనిపించారు.

Also Read..Karnataka elections 2023: కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు సీపీఐ ప్రకటన.. కర్ణాటక పర్యటనలో రాహుల్ గాంధీ

గ్రామాభివృద్ది గురించి ఫిర్యాదు చేసిన గ్రామస్తుడిపై ఎమ్మెల్యే పాటిల్ చేయి చేసుకోవడం దుమారం రేపింది. ఇది కరెక్ట్ కాదంటూ ఎమ్మెల్యే తీరుపై విమర్శలు వచ్చాయి. దాంతో ఈ వివాదంపై ఎమ్మెల్యే పాటిల్ స్పందించారు. ఆ యువకుడు అన్ పార్లమెంటరీ పదాలు వాడాడని, అందుకే అతడిపై చేయి చేసుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.