గౌతం గంభీర్‌పై క్రిమినల్ కేసు

గౌతం గంభీర్‌పై క్రిమినల్ కేసు

Updated On : April 26, 2019 / 9:42 AM IST

గౌతం గంభీర్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. ఈస్ట్ ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న గంభీర్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలు గుప్పించింది. రెండు ప్రదేశాల్లో నుంచి అతనికి ఓటు హక్కు ఉందన్న విషయంలో ఆప్ అతనిపై టిస్ హజారీ కోర్టులో కేసు నమోదైంది. 

ఆప్ ఈస్ట్ ఢిల్లీ అభ్యర్థి అతిషి ఈ విషయాన్ని లేవనెత్తుతూ అతనిపై అనర్హత వేటు వేయాలని కోరారు. రాజకీయ నాయకుడిగా మారిన క్రికెటర్ రాజేంద్ర నగర్, కరోల్ బాగ్ ప్రాంతాల్లో ఓటు ఉండటంపై ప్రశ్నించారు. ఈ నేర నిరూపణ అయితే సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించే అవకాశాలు ఉన్నాయి. అంతేగానీ, గంభీర్‌పై తక్షణ చర్యలు చేసే అవకాశం మాత్రం లేదు. 

ఢిల్లీలో మే12న జరగనున్న ఎన్నికలకు ఆప్ పార్టీ తన నామినేషన్లను ఇచ్చింది. ఈస్ట్ ఢిల్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు గంభీర్ ఏప్రిల్ 23 మంగళవారమే తన నామినేషన్ దాఖలు చేశాడు.