పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన వాయిదా, కారణం ఏంటంటే..

ఇందులో భాగంగా హెలికాప్టర్ లో పర్యటనలకు వెళ్లి రాత్రికి అమరావతి వచ్చేలా తన టూర్లను షెడ్యూల్ చేసుకున్నారు పవన్.

పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన వాయిదా, కారణం ఏంటంటే..

Pawan Kalyan

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన వాయిదా పడింది. ఇప్పటికే భీమవరం టూర్ వాయిదా వేసుకున్నారు పవన్ కల్యాణ్. హెలీపాడ్ ఏర్పాటుకు అనుమతులు నిరాకరించడంతో అమలాపురం పర్యటన వాయిదా పడింది.

ఎన్నికల కసరత్తు చేపట్టాల్సి ఉన్నందున ప్రతి రోజూ పార్టీ కార్యాలయానికి రావాలని భావించారు పవన్ కల్యాణ్. ఇందులో భాగంగా హెలికాప్టర్ లో పర్యటనలకు వెళ్లి రాత్రికి అమరావతి వచ్చేలా తన టూర్లను షెడ్యూల్ చేసుకున్నారు పవన్. అయితే, వివిధ ప్రాంతాల్లో హెలీపాడ్ల ఏర్పాటుకు ఆర్ అండ్ బీ అనుమతులు నిరాకరించడంతో పర్యటనలు వాయిదా పడుతున్నాయి. ఆర్ అండ్ బీ అధికారుల తీరుపై జనసేన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హెలీపాడ్ ఏర్పాటుకు ఆర్ అండ్ బీ అధికారులు కావాలనే ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. కాగా, పవన్ పర్యటనలను రీ-షెడ్యూల్ చేసే పనిలో పడింది జనసేన అధిష్టానం.

Also Read : కృష్ణా జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ.. అభ్యర్థులు వీళ్లే?

కొటికలపూడి గోవిందరావు, జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు
రేపు భీమవరంలో జరగాల్సిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన రద్దయింది. ఆర్ అండ్ బీ అధికారులు హెలిప్యాడ్ కు అనుమతులు ఇవ్వకపోవడం హాస్యాస్పదం. ఓటమి భయంతో, వైసీపీ నాయకుల ఒత్తిడితో వంకలు చెబుతూ అనుమతి ఇవ్వలేదు. జనసేనను ఎదుర్కోలేక వైసీపీ కుట్రగా భావిస్తున్నాము. అధికార వైఎస్సార్ సీపీ.. ఓటమిని అంగీకరించాలి. అధికార పార్టీకి అడ్డురాని నిబంధనలు ఇప్పుడు చెబుతున్నారు. టెక్నాలజీ పెరిగినా అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. కావాలని అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడం పిరికిపంద చేష్టగా భావిసున్నాము. త్వరలోనే తేదీ ప్రకటించి పవన్ కల్యాణ్ భీమవరం వస్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియంతృత్వ పోకడలకు భీమవరం నుంచే పతనం ప్రారంభమవుతుంది.

Also Read : ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌.. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యల వెనుక పక్కా ప్లాన్?