తెలంగాణ బడ్జెట్ : మోదీని నమ్ముకుంటే..శంకరగిరిమాన్యాలే – కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో పౌల్ట్రీ రంగం, కోళ్ల దాణా విషయంలో ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు సీఎం కేఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, మోదీ సర్కార్‌ను నమ్ముకుంటే..శంకరగిరి మాన్యాలే..అంటూ..ఎద్దేవా చేశారు. ఉన్నది లేనిది ఊహించుకుని పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి.
2020, మార్చి 12వ తేదీ గురువారం పౌల్ట్రీ రంగంలో అతిపెద్ద స్కాం జరిగిందని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. కేంద్ర ప్రభుత్వం డబ్బులు అందచేస్తోందని బీజేపీ సభ్యులు ఆరోపించారు. దీంతో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకున్నారు. ఐదు సంవత్సరాల్లో రూ. 10 వేల కోట్లు టచ్ కాలేదని, ఏదో ఇచ్చామని భ్రమ కల్పించవద్దని బీజేపీ సభ్యులకు సూచించారు. దేశ ఆర్థిక పురోభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం తోడ్పాటు అందిస్తోందని తెలిపారు. రూ. 50 వేల కోట్లకు పైగా ఇస్తే..కేంద్రం ఇచ్చేది రూ. 24 వేల కోట్లు మాత్రమేనన్నారు.
See Also | వదలిపెట్టం, రంగారెడ్డి జిల్లాలో భూఆక్రమణలపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం
బీజేపీ పార్టీ వాళ్లకు..లేక లేక దేశంలో అధికారంలోకి వచ్చిందని, 50 – 60 ఏళ్ల నుంచి పోటీ చేస్తే..ఇప్పుడు అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ అట్టర్ ప్లాఫ్ అయ్యాయని, యూపీఏ పార్టీపై వచ్చిన విసుగుతో..బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. తాను చెప్పిన లెక్కలు కరెక్టు కాకపోతే..తాను రాజీనామా చేస్తానని గతంలో సవాల్ చేసినట్లు సభకు తెలిపారు.
కేంద్రం వసూలు చేసే కొన్ని రకాల పన్నులల్లో రాష్ట్రాల యొక్క వాటా..బిచ్చమెత్తుకొనేది కాదన్నారు. పన్నులు వసూలు చేసే బాధ్యత కేంద్రానికి ఇచ్చారని తెలిపారు. జీఎస్టీ వల్ల కలిగే నష్టాన్ని ఐదేళ్లు కేంద్ర ప్రభుత్వమే భరించాలని సూచించారు. క్వింటాళ్లు ధాన్యానికి రైతులు ఇబ్బందులు పడలేదని, వంద శాతం వారి దగ్గర ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు తెలిపారు. పౌల్ట్రీ రంగం అభివృద్ధి కి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని, రాష్ట్రంలో కరోనా లేదన్నారు. కోళ్ల దాణా మక్కలు తింటాడా ? గిదేదో స్కాం అంటున్నారని ప్రతిపక్షాల ఆరోపణలను సీఎం కేసీఆర్ తిప్పికొట్టారు.
Read More : మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం : సీఎం పదవిపై బీజేపీలో తర్జనభర్జనలు