టీడీపీ, వైసీపీ నుంచి పోలీసులు డబ్బులు వసూలు : పెనమలూరు మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు

పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావుని కలిశారు. పెనమలూరు పోలీసులపై ఆయన ఆరోపణలు చేశారు. ఎన్నికల సమయంలో పెనమలూరు పోలీసులు డబ్బు వసూలు చేశారని ఫిర్యాదు చేశారు. టీడీపీ నుంచి రూ.3లక్షలు, వైసీపీ నుంచి రూ.5లక్షలు కలెక్ట్ చేశారని సీపీకి చెప్పారు. పెనమలూరు పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బోడె ప్రసాద్ ఫిర్యాదుతో పెనమలూరు సీఐ, ఇతర పోలీసులపై విచారణకు సీపీ ఆదేశించారు.
పెనమలూరు పోలీసులపై మాజీ ఎమ్మెల్యే బోడె చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై విచారణకు ఆదేశించిన సీపీ నివేదిక కోసం వెయిట్ చూస్తున్నారు. నివేదిక వచ్చాక తప్పు చేశారని తేలితే కఠిన చర్యలు తీసుకోనున్నారని సమాచారం.
Also Read : టీడీపీని దెబ్బకొట్టేందుకు : వైసీపీ, బీజేపీ, ఈసీ కుట్ర