విడగొట్టారు : ఆ 10శాతం రిజర్వేషన్లలో సగం కాపులకు
అమరావతి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రకులాల్లో పేదలకు ఇచ్చే 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. మిగతా 5 శాతం రిజర్వేషన్లు అగ్రకులాల పేదలకు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది.

అమరావతి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రకులాల్లో పేదలకు ఇచ్చే 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. మిగతా 5 శాతం రిజర్వేషన్లు అగ్రకులాల పేదలకు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది.
అమరావతి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రకులాల్లో పేదలకు ఇచ్చే 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. మిగతా 5 శాతం రిజర్వేషన్లు అగ్రకులాల పేదలకు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. ఓసీల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. దీన్ని ఏపీలోనూ అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అయితే అందులో 5శాతం రిజర్వేషన్లు కాపులకు కేటాయించాలని తీర్మానించింది. 2019, జనవరి 21వ తేదీ సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో దీనిపై లోతుగా చర్చ జరిగింది.
కాపులను బీసీలుగా గుర్తించి, వారికి ఐదుశాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. మంజునాథ కమిషన్ సిఫారసులు, అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపించింది. కానీ… ఢిల్లీ నుంచి స్పందన రాలేదు. అదే సమయంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(EWS) 10 శాతం కోటాపై కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనిపై రాష్ట్రాలు స్థానిక పరిస్ధితులకు అనుగుణంగా నిబంధనలు రూపొందించుకొనే స్వేచ్ఛ ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటాను ఆమోదిస్తూ, అందులో 5 శాతం రిజర్వేషన్లు కాపులకు కేటాయించాలని మంత్రివర్గం తీర్మానించింది. ఆ విధంగా ఆర్థిక బలహీన వర్గాలకు మేలు చేయడంతోపాటు, కాపులకు తాము ఇచ్చిన హామీని నెరవేర్చినట్లవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ అంశంపై సమగ్రంగా చర్చించి విధివిధానాలను అసెంబ్లీ ముందుకు తీసుకురావాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారం పూర్తి కావొస్తున్నా రిజర్వేషన్ల హామీ మాత్రం నెరవేరలేదు. దీంతో చంద్రబాబు ప్రభుత్వంపై కాపులు కోపంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో వారిని ప్రసన్నం చేసుకునేందుకు చంద్రబాబు ఈ ప్రతిపాదన తీసుకొచ్చారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.