Rajasthan Politics: సచిన్ పైలట్ కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారా? అనుమానాలకు తావిస్తున్న తండ్రి వర్ధంతి సందేశం

రాజేశ్ పైలట్ 1996లో సోనియా గాంధీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఆ ఎన్నికలో ఆయన దారుణ పరాభవం పాలైనప్పటికీ పార్టీలో కొనసాగారు. సచిన్ పైలట్‭కు కూడా ఇలాంటి అనుభవమే ఉంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మీద తిరుగుబాటు చేశారు

Rajasthan Politics: సచిన్ పైలట్ కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారా? అనుమానాలకు తావిస్తున్న తండ్రి వర్ధంతి సందేశం

sachin pilot

Updated On : June 11, 2023 / 1:09 PM IST

Sachin Pilot: చాలా కాలంగా విపక్షం జోలికి పోకుండా సొంత పార్టీ ప్రభుత్వంపైనే పోరాటం చేస్తున్న రాజస్థాన్ కాంగ్రెస్ కీలక నేత సచిన్ పైలట్ కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తాజా ఆయన తండ్రి రాజేష్ పైలట్ వర్ధంతి సందర్భంగా సచిన్ చేసిన ట్వీట్ ఈ అనుమానాలకు మరింత ఆజ్యం పోస్తోంది. ప్రజల తన తండ్రికి ఉన్న అనుబంధం, రాజీపడనితత్వాన్ని తాను కొనసాగిస్తానని పైలట్ అంటున్నారు. చాలా కాలంగా కాంగ్రెస్ అధిష్టానం హెచ్చరికల్ని లెక్కచేయకుండా, బుజ్జగింపులకు లొంగకుండా తన పంథాలోనే వెళ్తున్నారు.

Brij Bhushan Singh Case:మహిళా రెజ్లర్లకు పోలీసుల కొత్త ట్విస్ట్… లైంగిక వేధింపుల కేసులో ఫొటోలు, వీడియోలు, వాట్సాప్ ఛాట్‌ల ఆధారాలివ్వండి

ఇక ఆదివారం చేసిన ట్వీట్‮‭లో ‘‘పూజ్యులపైన నా తండ్రి శ్రీ రాజేష్ పైలట్ గారి వర్ధంతి సందర్భంగా నేను ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను. ప్రజా కార్యక్షేత్రంతో ఆయనకున్న అనుబంధం, ప్రజలతో ఆయనకున్న అనుబంధం, ప్రజా సంక్షేమం పట్ల అంకితభావంతో పని చేసే విధానం నాకు మార్గదర్శకాలు. ప్రజా ప్రయోజనాలే పరమావధిగా భావించి ఆయన తన సూత్రాలపై ఎప్పుడూ రాజీపడలేదు. ఆయన ఆలోచనలు, ఆదర్శాలను ఎప్పుడూ పాటిస్తాను’’ అనే అర్థంలో హిందీలో ట్వీట్ చేశారు.

Sushi Terrorism: కప్పులు ఎంగిలి చేస్తూ రెస్టారెంట్‭లో పాడు పని.. జపాన్ యువకుడికి గట్టిగానే పడింది పిడి

రాజేశ్ పైలట్ 1996లో సోనియా గాంధీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఆ ఎన్నికలో ఆయన దారుణ పరాభవం పాలైనప్పటికీ పార్టీలో కొనసాగారు. సచిన్ పైలట్‭కు కూడా ఇలాంటి అనుభవమే ఉంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మీద తిరుగుబాటు చేశారు. అయితే పూర్తి మెజారిటీతో గెహ్లాట్ తన పంథాన్ని నెగ్గించుకున్నారు. తిరుగుబాటు విఫలమై పదవులు కోల్పోయినప్పటికీ సచిన్ మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు. కానీ గెహ్లాట్ మీద తన పంథాను మాత్రం మార్చుకోవడం లేదు. అయితే తన తండ్రి రాజేశ్ పైలట్‭లా పార్టీలోనే ఉండిపోకుండా కొత్త పార్టీతో రావాలని సచిన్ చూస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.