కొణతాల రామకృష్ణతో పవన్ కల్యాణ్ కీలక చర్చలు

అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నేతలతో నాగబాబు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు కొణతాల రామకృష్ణ.

కొణతాల రామకృష్ణతో పవన్ కల్యాణ్ కీలక చర్చలు

Konathala Ramakrishna

Updated On : February 19, 2024 / 12:00 AM IST

Konathala Ramakrishna : విశాఖలో సీనియర్ నేత కొణతాల రామకృష్ణ ఇంటికెళ్లారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఉత్తరాంధ్ర సమస్యలు, తాజా రాజకీయాలపై కొణతాలతో చర్చించారు. అనకాపల్లి పార్లమెంటుకు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. వారం రోజులుగా అనకాపల్లి కేంద్రంగా నాగబాబు రాజకీయాలు చేస్తున్నారు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నేతలతో నాగబాబు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు కొణతాల రామకృష్ణ. దీంతో కొణతాలతో చర్చించేందుకు ఆయన నివాసానికి వెళ్లారు పవన్.

వచ్చే ఎన్నికలు, ఉత్తరాంధ్ర సమస్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో చర్చించానని మాజీమంత్రి కొణతాల రామకృష్ణ తెలిపారు. జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన వెల్లడించారు.

Also Read : ఎన్నికల వేళ.. తుఫాన్‌లా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు