నాగబాబు పోటీ చేసేది అక్కడి నుంచేనా?
పవన్ కల్యాణ్ భీమవరం వెళ్లకుండా ఆపే శక్తి ఎవరికీ లేదన్నారు నాగబాబు.

Nagababu
Nagababu : ఏపీలో ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. అధికార పార్టీ వైసీపీ దూకుడు మీదుంది. ఇప్పటికే అందరికన్నా ముందుగా వైసీపీ అభ్యర్థులను దాదాపుగా ప్రకటించేశారు సీఎం జగన్. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఇంకా కసరత్తు చేస్తోంది. పొత్తుల అంశం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. టీడీపీ-జనసేన పొత్తు ఖరారైనా.. బీజేపీ వ్యవహారం ఇంకా తేలాల్సి ఉంది. టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ చేతులు కలుపుతుందా? లేదా? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. జనసేనకు లభించే సీట్లు ఎన్ని? ఎవరెవరు పోటీ చేయనున్నారు? ఎక్కడి నుంచి బరిలోకి దిగనున్నారు? అనేది సస్పెన్స్ గా మారింది. ఈ క్రమంలో జనసేన నాయకుడు నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో పోటీపై జనసేన జేఏసీ సభ్యుడు నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తాను పోటీ చేసేది లేనిది త్వరలోనే స్పష్టత వస్తుందన్నారు. తాను పోటీ చేసేది లేనిది పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయిస్తారని చెప్పారు నాగబాబు. తాను త్వరలోనే అనకాపల్లి జిల్లా యలమంచిలిలో నివాసం ఉండబోతున్నానని తెలిపారు. పవన్ కల్యాణ్ భీమవరం వెళ్లకుండా ఆపే శక్తి ఎవరికీ లేదన్నారు నాగబాబు.
Also Read : 4 దశాబ్దాల చరిత్రలో తొలిసారి.. రాజ్యసభ ఎన్నికల నుంచి టీడీపీ నిష్క్రమణ..
అనకాపల్లి నుంచి జనసేన తరపున నాగబాబు ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. టీడీపీతో పొత్తులో భాగంగా కాకినాడ, మచిలీపట్నం, అనకాపల్లి పార్లమెంట్ స్థానాలు జనసేనకు కేటాయించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అనకాపల్లిలోనే ఉంటానని తాజాగా నాగబాబు ప్రకటించడంతో ఈ ప్రచారానికి బలం చేకూరింది. గత ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి నాగబాబు ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
”విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు నాగబాబు. మా పార్టీ అధినేత ఆదేశాలతో ఎన్నికల బరిలో నిలబడతా. ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే దానిపై త్వరలోనే స్పష్టత వస్తుంది. అనకాపల్లి జిల్లా యలమంచిలిలో నివాసం ఉండబోతున్నా. అక్కడి నుంచే పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటా. పవన్ కల్యాణ్‌ను భీమవరం వెళ్లకుండా ఎవరూ ఆపలేరు. హెలికాప్టర్ దిగేందుకు అధికారులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో పవన్ తన పర్యటనలను వాయిదా వేసుకున్నారు” అని నాగబాబు తెలిపారు.
Also Read : ఏపీని షేక్ చేస్తున్న నెల్లూరు పెద్దారెడ్ల పొలిటికల్ ఇష్యూస్