మార్చ్ టెన్షన్ : ఆంధ్రా యూనివర్సిటీ గేట్లు క్లోజ్..విద్యార్థుల ఆగ్రహం

జనసేన లాంగ్ మార్చ్ సందర్భంగా విశాఖలోని మద్దిలపాలెం ఆంధ్రా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గేట్లను మూసివేయడంపై స్టూడెంట్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ రోజే ఎందుకు గేట్లను క్లోజ్ చేశారని మండిపడ్డారు. వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ కార్యకర్తగా పనిచేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. 2019, నవంబర్ 03వ తేదీ ఆదివారం మద్దిలపాలెం తెలుగు తల్లి విగ్రహం నుంచి జనసేన నిర్వహించతలపెట్టిన లాంగ్ మార్చ్ ప్రారంభం కానుంది.
ఈ మార్చ్‌లో పాల్గొనేందుకు జనసేన పార్టీ, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. విద్యార్థి సంఘాల నాయకులు కూడా హాజరవుతున్నారు. అయితే..ఏయూ గేట్ల మూసివేతపై విద్యార్థి జేఏసీ ఆందోళన చేపట్టింది. ఇంజినీరింగ్ గేటు తెరవాలని డిమాండ్ చేస్తున్నారు. వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గేటు ఎదుట బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థులను సముదాయించేందుకు ప్రయత్నించారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వీసీ వైసీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారంటూ స్టూడెంట్స్ మండిపడ్డారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో 10tv మాట్లాడింది. ఏ రోజు లేనిది ఈ రోజు గేటు ఎందుకు క్లోజ్ చేశారంటూ మండిపడ్డారు. జేయూ విద్యార్థి జేఏసీ మద్దతు తెలియచేస్తోందన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి రాకపోకలు లేవని తెలిపారు. గేట్లను తీసివేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Read More : అసభ్యంగా ప్రవర్తించాడని పూజారిపై మహిళలు దాడి