Valentine’s Day: 40% ప్రేమతో బీజేపీకి ‘వాలెంటైన్స్ డే’ విషెస్ చెప్పిన కాంగ్రెస్

Valentine’s Day: 40% ప్రేమతో బీజేపీకి ‘వాలెంటైన్స్ డే’ విషెస్ చెప్పిన కాంగ్రెస్

Karnataka Congress showers Valentine's Day messages on BJP

Updated On : February 14, 2023 / 6:28 PM IST

Valentine’s Day: కాంగ్రెస్ పార్టీ చేసే ‘40 శాతం కమిషన్’ ఆరోపణలు కర్ణాటక ప్రభుత్వాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్నాయి. బొమ్మై ప్రభుత్వం చేసే ఏ పనిలో అయినా 40 శాతం కమిషన్ ఉంటుందని ఆరోపణలు ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ.. ఈ ప్రచారాన్ని ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా ఉపయోగించుకుంటూ సీఎం బొమ్మైని ఇరుకున పడేస్తోంది. ఇక తాజాగా ‘ప్రేమికుల దినోత్సవా’న్ని కూడా వదిలిపెట్టకుండా అద్భుతమైన మీమ్‭తో సీఎం బొమ్మైని నెట్టింట్లో నవ్వుల పాలు చేసింది కాంగ్రెస్. బొమ్మైకి ప్రేమ కూడా 40 శాతమే ఉంటుందని, బీజేపీ నేతలంతా 40 శాతం స్వచ్ఛమైన ప్రేమికులంటూ సెటైర్లు గుప్పించింది.

Amit Shah: మొఘల్ వారసత్వాన్ని ఎవరూ చెరిపేయలేరు.. ఆసక్తికరంగా స్పందించిన అమిత్ షా

కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్‭ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘బీజేపీ నేతలంతా స్వచ్ఛమైన 40 శాతం ప్రేమికులు. రోమియో, జూలియట్ ప్రేమ కంటే 40 శాతం ఉండే వీరి ప్రేమ ఎంతో ఉద్వేగభరితమైంది. ప్రేమికుడి కల అంటే మనసులోని ప్రియురాలిని చూసినట్లే. బీజేపీ మనసు కూడా 40 శాతం ధ్యానంతో ఉంటుంది’’ అని రాసుకొచ్చారు. ఈ మీమ్, నెటిజెన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. నెటిజెన్లు సైతం తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. కాంగ్రెస్ అనుకూలురు 40 శాతం కాంట్రవర్సీని హైలైట్ చేస్తుండగా, బీజేపీ అనుకూలురు నెహ్రూ, సోనియా లాంటి నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Valentine’s Day Special : వ్యాలెంటైన్స్ డే స్పెషల్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 14పై అదిరే డిస్కౌంట్.. మరెన్నో ఆఫర్లు.. ఇప్పుడే కొనేసుకోండి..!

ఇక ఇతర బీజేపీ నేతలనూ కాంగ్రెస్ వదల్లేదు. కౌ హగ్ డే గుర్తు చేస్తూ వేసిన మీమ్ సైతం చక్కర్లు కొడుతోంది. ఇక తేజస్వీ సూర్య విమానం డోర్ ఓపెన్ చేసిన ఘటనను ప్రస్తావిస్తూ వేసిన మీమ్ కూడా హల్ చల్ చేస్తున్నాయి. కాంగ్రెస్ షేర్ చేసిన మీమ్స్ ఓసారి చూద్దాం.