తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై మండలిలో కీలక చర్చ

విగ్రహం, చిహ్నం తయారీలో బీఆర్ఎస్ నేతల సలహాలు కూడా తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై మండలిలో కీలక చర్చ

Telangana State Emblem

Telangana State Emblem : శాసన మండలిలో తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు పై చర్చ జరిగింది. కాకతీయ తోరణంలో ఏం రాచరికపు ఆనవాళ్ళు ఉన్నాయని ప్రశ్నించారు ఎమ్మెల్సీ దేశపతి. భూమి, నీటిని తల్లితో పోలుస్తాం, అదే విధంగా తెలంగాణ ఉద్యమంలో ఓ ప్రొఫెసర్ తెలంగాణ తల్లి ప్రతిమను రూపొందించారని ఆయన చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే ఓ సామాజికవర్గ దొరసాని గుర్తుకు వస్తుందని ప్రభుత్వ పెద్దలు చెప్పడం సమంజసం కాదన్నారు దేశపతి శ్రీనివాస్. కాకతీయ రాజులు తెలంగాణ సమాజానికి ఎన్నో మంచి పనులు చేశారని, నిజాం రాజులు హైదరాబాద్ అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారని దేశపతి శ్రీనివాస్ తెలిపారు.

Also Read : తెలంగాణలో వీటి పేర్లనూ మార్చాలి: బీజేపీ ఎమ్మెల్యే

కాగా.. కాకతీయ తోరణం, తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని మార్పులు చేర్పులు ఉంటాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ ను గౌరవిస్తామన్నారాయన. కాకతీయులు, మొగల్ సామ్రాజ్యంలో మంచి, చెడు రెండు జరిగాయన్నారు. చెడు మరోసారి జరగకుండా చూస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

ప్రభుత్వమే విగ్రహం తయారు చెయ్యదని మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అన్ని వర్గాల అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. ఏకపక్ష నిర్ణయం తీసుకోము అని తేల్చి చెప్పారు. విగ్రహం, చిహ్నం తయారీలో బీఆర్ఎస్ నేతల సలహాలు కూడా తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

Also Read : కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. సంచలన విషయాలు ఇవిగో..

రాజీవ్ గాంధీ అంటే గౌరవమే.. కానీ- ఎమ్మెల్సీ కవిత
రాష్ట్ర ప్రభుత్వం నిన్న సెక్రటేరియట్ దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహానికి భూమి పూజ చేసింది. అక్కడ తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలనుకున్నం. కానీ అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాని వ్యతిరేకిస్తున్నాం. మాకు ఆయన పేరు అంటే గౌరవం ఉంది. జాతీయ నాయకుల పేర్లు ఇప్పటికే ఎయిర్ పోర్టుకి పెట్టుకున్నాం. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాల్సిన చోట ఈ విగ్రహం పెట్టటం సబబు కాదు.