Dhanpal Suryanarayana: తెలంగాణలో వీటి పేర్లనూ మార్చాలి: బీజేపీ ఎమ్మెల్యే

TSను TG మార్చుతున్నారని, అలాగే తెలంగాణ లోగోను మార్చుతున్నారని ధన్ పాల్ సూర్యనారాయణ గుర్తుచేశారు.

Dhanpal Suryanarayana: తెలంగాణలో వీటి పేర్లనూ మార్చాలి: బీజేపీ ఎమ్మెల్యే

Dhanpal Suryanarayana

తెలంగాణలోని పలు జిల్లాలు, పట్టణాల పేర్లను మార్చాలని బీజేపీ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ అన్నారు. 10 టీవీతో ఆయన ఇవాళ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను భాగ్యనగర్‌గా, నిజామాబాద్‌ను ఇందుర్‌గా, ఆదిలాబాద్‌ను ఎదులాబాద్‌గా, వరంగల్‌ను ఓరుగల్లుగా మార్చాలని డిమాండ్ చేశారు.

TSను TG మార్చుతున్నారని, అలాగే తెలంగాణ లోగోను మార్చుతున్నారని ధన్ పాల్ సూర్యనారాయణ గుర్తుచేశారు. వీటిని ప్రజలు డిమాండ్ చేయలేదని అన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ వీటిని మారుస్తోందని తెలిపారు. ఎప్పటి నుంచో ప్రజల నుంచి ఉన్న డిమాండ్‌ను ఇవాళ తాను అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ముందు పెట్టానని చెప్పారు.

ఆయా ప్రాంతాల పేర్లను ప్రభుత్వం మారుస్తుందని అనుకుంటున్నానని ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. పేర్ల మార్పు అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పారు. తమిళనాడులో తమ ప్రభుత్వం ఎప్పుడూ లేదని, అక్కడ మద్రాసును చెన్నైగా మార్చారని గుర్తుచేశారు. అలాగే, మహారాష్ట్రలో బాంబే పేరును ముంబైగా మార్చారని చెప్పారు.

CAG: కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. సంచలన విషయాలు ఇవిగో..