CAG: కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. సంచలన విషయాలు ఇవిగో..

గడిచిన మూడు సంవత్సరాలుగా రెవెన్యూ రాబడిని సాధించడంలో విఫలం...

CAG: కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. సంచలన విషయాలు ఇవిగో..

CAG audit

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం కాగ్ రిపోర్ట్‌ను ప్రవేశ పెట్టింది. పంచాయతీరాజ్, రెవెన్యూ, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ రిపోర్ట్‌లోని అంశాలు సంచలనం రేపుతున్నాయి.

  • కాగ్ రిపోర్టులోకి అంశాలు
  • కాళేశ్వరం ఒక్క ప్రాజెక్టుకు కార్పొరేషన్ ద్వారా రూ.66,854 కోట్లు తీసుకున్నారు
  • 14 సంవత్సరాలలోగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 2,52,048 కోట్ల రూపాయలు తీర్చాల్సి ఉంటుంది
  • బడ్జెట్లో కేవలం ఖర్చయింది 77% మాత్రమే. రుణాల చెల్లింపునకు రూ.1,45,545 కోట్లు అవుతుంది
  • రాష్ట్రం రెవెన్యూ లేటులో ఉంది, ఆ రెవెన్యూ లోటు మార్కెట్ నుండి తీసుకున్న రుణాల ద్వారా భర్తీ చేయాల్సి వచ్చింది
  • రిజర్వు బ్యాంకు నుంచి చేబదుళ్ల కింద రూ.67,174 కోట్ల అధిక వ్యయమయింది
  • 2022 మార్చి 31 నాటికి రాష్ట్రంలో 83 రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు మూడు చట్టబద్ధమైన కార్పొరేషన్లు ఉన్నాయి
  • అందులో 8 విద్యుత్ రంగానికి చెందినవి కాగా మిగతావి విద్యుతేతర రంగాలు
  • 2022 మార్చి 31 నాటికి 39 ప్రభుత్వానికి సంస్థలు తీవ్ర నష్టాల్లో ఉన్నాయి..
  • 2020 సంవత్సరానికి సంబంధించి 67 ప్రభుత్వ రంగ సంస్థల్లో కేవలం 12 మాత్రమే లాభాల్లో ఉన్నాయి. మిగతావి నష్టాల్లో ఉన్నాయి
  • 32 కార్పొరేషన్ లు వాటి వాటి పద్దుల రిపోర్ట్ లను సరిగా సమర్పించడం లేదు..
  • 8 ప్రభుత్వ రంగ సంస్థల చట్టబద్ధమైన ఆడిటర్లు సవరించారు..
  • డీపీఆర్ లో 63,352 కోట్లు చూపెట్టగా 1,06,000 కోట్లకు అంచనా వ్యయం పెంచారు
  • ప్రస్తుత నిర్మాణం వరకు 14 లక్షల ఎకరాల కు ఆయకట్టు ఉంది..
  • మొత్తం ఈ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు 1,47,427 కోట్లు ఖర్చు అవుతుంది
  • ప్రాజెక్టు నుంచి ఊహించిన ప్రయోజనాలను ఎక్కువ చూపెట్టారు..
  • ప్రాజెక్టు వార్షిక ఖర్చులు తక్కువ చూపారు. కాళేశ్వరం నీటి అమ్మకం ద్వారా 1019కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారు
  • ప్రాజెక్టు కోసం భారీగా రుణాలు తీసుకున్నారు.. 15 బ్యాంకు లతో 87 వేల కోట్లు సమకూర్చుకోవాలని ఒప్పందం చేసుకున్నారు
  • బడ్జెటేతర రుణాల పై ప్రభుత్వం ఎక్కువ ఆధారపడి ఉంది.. రుణాలు చెల్లించడంలో కాలయాపన చేసింది
  • ప్రాజెక్టు నిర్వహణ కోసం ప్రతి సంవత్సరం 700 కోట్ల నుంచి 14 వేల 5 వందల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది
  • రుణాలు కట్టడం కోసం మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి .. కాళేశ్వరం అప్పు కట్టంకుంటూ పోతే 2036లో పూర్తవుతుంది

 

  • కాగ్ రిపోర్ట్… పంచాయతీ రాజ్ శాఖ
  • గ్రాంట్ల మళ్లింపు జరిగింది. నిధుల దుర్వినియోగం జరిగింది
  • బకాయిలు వసూలు చేయలేకపోయారు..
  • కొన్ని పనులకు అధిక బిల్లు లు చెల్లించారు..
  • సకాలంలో రికార్డులు సమర్పించలేదు
  • రెవెన్యూ
  • గడిచిన మూడు సంవత్సరాలుగా రెవెన్యూ రాబడిని సాధించడంలో విఫలం
  • ద్రవ్య లోటు 46,638 కోట్లు, అప్పుల నిష్పత్తి gsdp తో పోలిస్తే 37.77 శాతం
  • Frbm పరిమితి తో మన రాష్ట్ర అప్పుల నిష్పత్తి 12.77 శాతం ఎక్కువగా ఉంది
  • 15వ ఆర్థిక సంఘంతో పోలిస్తే మన రాష్ట్ర నిష్పత్తి 8. 47% ఎక్కువ
  • మొత్తం రాష్ట్రం సొంత పనుల నుంచి షాపులు రిజిస్ట్రేషన్లు వస్తుసేవల పన్ను అమ్మకాలు ఇవన్నీ 91,270 కోట్లు రాష్ట్రానికి రాబడి
  • 2021-22 లో వ్యవహారిక వ్యయం 1,36,804 కోట్ల రూపాయలు
  • వ్యవహారిక విషయంలో జీతాలు, పెన్షన్ల మీద ఖర్చు తగ్గింది
  • పోయిన ప్రభుత్వం విద్య, వైద్యం మీద ఖర్చుల విషయంలో వెనుకంజులో ఉంది
  • మొత్తం వ్యయంలో.. విద్య మీద 8 శాతం ఖర్చు చేయగా, వైద్యం కోసం 4 శాతం మాత్రమే ఖర్చు చేశారు

ఎన్నికల వేళ పార్టీలకు సుప్రీంకోర్టు షాక్.. ఎలక్టోరల్ బాండ్స్ స్కీంపై సంచలన తీర్పు