చంద్రబాబుకి షాక్ : కాపు నేత రాజీనామా

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ఇన్ చార్జ్ పదవికి వరుపుల రాజా రాజీనామా చేశారు.  రాజీనామా చేయడానికి గల కారణాలు ఆయన తెలిపారు. టీడీపీ మునిగిపోయే నావ అన్నారు.

  • Published By: veegamteam ,Published On : August 29, 2019 / 12:40 PM IST
చంద్రబాబుకి షాక్ : కాపు నేత రాజీనామా

Updated On : August 29, 2019 / 12:40 PM IST

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ఇన్ చార్జ్ పదవికి వరుపుల రాజా రాజీనామా చేశారు.  రాజీనామా చేయడానికి గల కారణాలు ఆయన తెలిపారు. టీడీపీ మునిగిపోయే నావ అన్నారు.

వరుపుల రాజా టీడీపీ చీఫ్ చంద్రబాబుకి షాక్ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ఇన్ చార్జ్ పదవికి వరుపుల రాజా రాజీనామా చేశారు. రాజీనామా చేయడానికి కారణాలు ఆయన తెలిపారు. టీడీపీ మునిగిపోయే నావ అన్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీకి మనుగడ లేదన్నారు. టీడీపీలో కాపులకు గుర్తింపు లేదన్నారు. పార్టీలో ఓ వర్గానికే పదవులు, కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించారు. అంతేకాదు సీఎం జగన్ పాలన బాగుందని కితాబిచ్చారు.

జగన్ పాలనలో రాష్ట్రంలో ప్రక్షాళన జరుగుతోందన్నారు. పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం జగన్ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. బీజేపీలో చేరాల్సిందిగా తనకు ఆహ్వానం వచ్చిందన్న రాజా.. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. వరుపుల రాజాతో పాటు కాపు సామాజికవర్గానికి చెందిన మరికొందరు నేతలు కూడా పార్టీకి రాజీనామా చేశారు.