Karnataka Polls: ఢిల్లీలో మాజీ సీఎం కిరణ్ కుమార్ వరుస భేటీలు.. కర్ణాటక ఎన్నికల్లో కీలక బాధ్యతలు?

ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీకి పెద్ద అవకాశంగా దొరికిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వరుస ఢిల్లీ పర్యటనలతో బిజీబిజీగా ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో 40 నిమిషాలకు పైగా ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాజకీయాలపై చర్చ చేసినట్లు తెలుస్తోంది

Karnataka Polls: ఢిల్లీలో మాజీ సీఎం కిరణ్ కుమార్ వరుస భేటీలు.. కర్ణాటక ఎన్నికల్లో కీలక బాధ్యతలు?

JP Nadda and Kiran kumar reddy and others

Updated On : April 8, 2023 / 4:34 PM IST

Karnataka Polls: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ శనివారం కీలక భేటీ నిర్వహించింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కర్ణాటక బీజేపీ నేతలు సమావేశం అయ్యారు. నడ్డా, అమిత్ షా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర సీనియర్ నేత యడియూరప్ప, ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైతో పాటు తాజాగా బీజేపీలో చేరిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సైతం హాజరయ్యారు.

CR Kesavan: బీజేపీలోకి కాంగ్రెస్ నేతల చేరిక పర్వం.. తాజాగా దేశ తొలి గవర్నర్ మునిమనువడు

కర్ణాటక ఎన్నికల్లో అనుసరించాల్సిన వైఖరి, అభ్యర్థుల ఎంపిక సహా ఇతర అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డికి కర్ణాటక ఎన్నికలకు సంబంధించి కొన్ని బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే విషయమై రేపు పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను పార్లమెంటరీ బోర్డు ఖరారు చేయనుంది. బోర్డు సమావేశానికి ముందే పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు నడ్డాతో, అమిత్ షాతో రాష్ట్ర నేతలు చర్చించిన అంశాలను రేపటి పార్లమెంట్ బోర్డు సమావేశంలో మాట్లాడిన తర్వాత ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.

Vinod Kumar: హైదరాబాద్ పర్యటనలో మోదీ అలా అనడం తప్పు: వినోద్ కుమార్

ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీకి పెద్ద అవకాశంగా దొరికిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వరుస ఢిల్లీ పర్యటనలతో బిజీబిజీగా ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో 40 నిమిషాలకు పైగా ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాజకీయాలపై చర్చ చేసినట్లు తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో పనిచేసే అంశాల మీద అమిత్ షా, బీ ఎల్ సంతోష్‭లతో ఆయన చర్చలు చేశారు. కర్ణాటక మాజీ సిఎం యడియూరప్పతోనూ రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం ఢిల్లీలోనే ఉన్నారు. వీర్రాజు, కిరణ్ కుమార్ కలిసి సాయంత్రం 6 గంటల వరకు ఢిల్లీ బీజేపీ పెద్దలతో వరుస సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.