కోడెలని చంపేశారు : జగన్ లాంటి సీఎంని జీవితంలో చూడలేదు

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుది ఆత్మహత్య కాదు ముమ్మాటికీ ప్రభుత్వ హత్య అని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆరోపించారు. కేసులు పెట్టి మానసికంగా వేధించి కోడెలను

  • Published By: veegamteam ,Published On : September 17, 2019 / 06:09 AM IST
కోడెలని చంపేశారు : జగన్ లాంటి సీఎంని జీవితంలో చూడలేదు

Updated On : September 17, 2019 / 6:09 AM IST

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుది ఆత్మహత్య కాదు ముమ్మాటికీ ప్రభుత్వ హత్య అని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆరోపించారు. కేసులు పెట్టి మానసికంగా వేధించి కోడెలను

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుది ఆత్మహత్య కాదు ముమ్మాటికీ ప్రభుత్వ హత్య అని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆరోపించారు. కేసులు పెట్టి మానసికంగా వేధించి కోడెలను చంపేశారని చంద్రబాబు అన్నారు. అవమానాలు భరించలేకపోయిన కోడెల ఉరేసుకుని చనిపోయారని అన్నారు. దేశంలో ఇంత దారుణమైన మరణం జరగలేదని చంద్రబాబు వాపోయారు. కోడెల భౌతికకాయానికి నివాళి అర్పించిన చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

పాత ఫర్నీచర్ కోసం జీవితఖైదు వేసే కేసులు పెడతారా అని ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేధించి, హింసించడం వల్ల మనిషి చనిపోతే ఏమనాలి అని అడిగారు. లక్ష రూపాయల ఫర్నీచర్ కోసం ఆత్మహత్య చేసుకునేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కోడెల ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారని చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చాక 2 నెలల్లో కోడెలపై ఏకంగా 19 కేసులు పెట్టారని చంద్రబాబు చెప్పారు. సుప్రీంకోర్టు ఆర్డర్లు ఉన్నా, ఆధారాలు లేని కేసులు పెట్టారని చెప్పారు. కోడెలకు వ్యతిరేకంగా కేసులు పెట్టాలని వైసీపీ నేతలు పిలుపునిచ్చారని, ఇది దారుణం అని వాపోయారు. బెయిల్ కోసం లాయర్లు వెళ్తే బూతులు తిట్టారని చంద్రబాబు ఆరోపించారు. ఆధారాలు లేకపోయినా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి కోడెలని వేధించారని అన్నారు.

తనపైనా వైఎస్ 26 కేసులు పెట్టారని, అయినా ఒక్క కేసు కూడా నిరూపించలేకపోయారని చంద్రబాబు గుర్తు చేశారు. జగన్ సీఎం అయ్యాక కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని, టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తన రాజకీయ జీవితంలో తాను 11మంది సీఎంలను చూశానన్న చంద్రబాబు.. జగన్ లాంటి సీఎం ను చూడలేదన్నారు. కోడెలది ముమ్మాటికీ ప్రభుత్వ హత్య అని ఆరోపించిన చంద్రబాబు.. కోడెల వ్యవహారంపౌ సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.