హస్తినపై టీఆర్ఎస్ గురి : 16 ఎంపీలను గెలిపించండి – కేటీఆర్

  • Published By: madhu ,Published On : March 6, 2019 / 09:24 AM IST
హస్తినపై టీఆర్ఎస్ గురి : 16 ఎంపీలను గెలిపించండి – కేటీఆర్

Updated On : March 6, 2019 / 9:24 AM IST

16 లోక్ సభ స్థానాల్లో ‘కారు’ గెలుపే లక్ష్యంగా పనిచేస్తోంది. త్వరలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విజయదుందుభి మ్రోగించాలని టీఆర్ఎస్ ప్లాన్ వేస్తోంది. అందుకనుగుణంగా వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సెంటిమెంట్‌ను ఆయన తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫాలో అవుతున్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశాలను కేటీఆర్ కరీంనగర్ జిల్లా నుండి మొదలు పెట్టారు. మార్చి 06వ తేదీన జిల్లాకు వచ్చిన కేటీఆర్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 
Also Read : F-16 పాక్ దుర్వినియోగం: భారత్ ఆధారాలు..అమెరికా దర్యాప్తు

ఎస్ఆర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఢిల్లీ గద్దెపై ఎవరు కూర్చొవాలో టీఆర్ఎస్ నిర్ణయించే స్థాయికి ఎదగాలని సూచించారు. కేవలం 16 పార్లమెంట్ స్థానాలను గెలిస్తేనే అది సాధ్యమౌతుందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీయే కూటమి, కాంగ్రెస్ పార్టీలకు గడ్డు పరిస్థితులే ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయన్నారు. కరీంనగర్ జిల్లాకు రైలు, నిధులు రావాలన్నా..టీఆర్ఎస్ ఎంపీలు గెలవాల్సినవసరం ఉందని, ఇందుకు ప్రజలు టీఆర్ఎస్‌ని ఆశీర్వదించాలని కోరారు. 

సొంతంగానే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, అయితే ఐదేళ్లకాలంలో మోడీ ఎలాంటి పనులు చేయలేదన్నారు. దీనిని గుర్తించిన ప్రజలు ఇటీవలే జరిగిన ఎన్నికల్లో బీజేపీ గుణపాఠం చెబుతున్నారని తెలిపారు. ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరినా మోడీ సానుకూలంగా స్పందించలేదన్నారు. ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చొవాలో టీఆర్ఎస్ నిర్ణయించే స్థాయికి ఎదగాలని, ప్రధాన మంత్రి ఎవరు కావాలో ఫెడరల్ ఫ్రంట్ నిర్ణయిస్తుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ అంటే గిట్టని పార్టీలున్నాయని, వీటన్నింటినీ ఒకేతాటిపై తీసుకరావాలని కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. 
Also Read : వన్ ఢిల్లీ.. వన్ రైడ్ : మెట్రో, బస్సు జర్నీ ఈజీ

డిసెంబర్ 7వ తేదీన జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలు గొప్ప తీర్పు ఇచ్చారని, కేసీఆర్‌ను మరోసారి సీఎం చేశారని గుర్తు చేశారు. 2001లో మే 17వ తేదీన ఎస్ఆర్ కళాశాల మైదానంలో మా తెలంగాణ మాకు కావాలి అని గర్జించారని, కేబినెట్ మంత్రిగా ఉన్న సమయంలో కరీంనగర్ జిల్లాకు రైల్వే అనుమతులు తీసుకొచ్చారని తెలిపారు. గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ రూ. 200 కోట్లు గుమ్మరించిందన్నారు. 2006లో కరీంనగర్ ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో తెలంగాణ బిడ్డగా తాను ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలిచినట్లు తెలిపారు.

చొప్పదండి నియోజకవర్గంలో పార్టీ అధ్యక్షులను కాంగ్రెస్ నేతలు ప్రలోభ పెట్టి ఆ పార్టీలో చేరిపించుకున్నారని, కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఏమి చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని, ఇతర రాష్ట్రాలు ఈ పథకాలను ప్రవేశ పెడుతున్నాయన్నారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ని గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. 
Also Read : మరీ విడ్డూరం : పాక్‌ టీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా అభినందన్