హైకోర్టు సరిపోదు కర్నూలును రెండో రాజధాని చేయాలి : టీజీ వెంకటేష్ 

కర్నూలులో హైకోర్టు ఏర్పాటును స్వాగతిస్తున్నామని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. రాష్ట్ర రెండో రాజధానిగా కర్నూలును చేయాలని డిమాండ్ చేశారు.

  • Published By: veegamteam ,Published On : December 18, 2019 / 07:04 AM IST
హైకోర్టు సరిపోదు కర్నూలును రెండో రాజధాని చేయాలి : టీజీ వెంకటేష్ 

Updated On : December 18, 2019 / 7:04 AM IST

కర్నూలులో హైకోర్టు ఏర్పాటును స్వాగతిస్తున్నామని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. రాష్ట్ర రెండో రాజధానిగా కర్నూలును చేయాలని డిమాండ్ చేశారు.

కర్నూలులో హైకోర్టు ఏర్పాటును స్వాగతిస్తున్నామని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. రాష్ట్ర రెండో రాజధానిగా కర్నూలును చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమకు హైకోర్టు రావడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. అలాగే రాజధాని కోసం పోరాడుతామని తెలిపారు. రాయలసీమ హక్కుల కోసం విద్యార్థులు, సోషల్ వర్కర్స్, కొన్ని పార్టీలతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం పోరాడుతువచ్చామన్నారు. అడ్మినిస్ట్రేటివ్, హైకోర్టు, అసెంబ్లీ మూడు చోట్ల కాకుండా ఒకే చోట ఉంటే అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందన్నారు.

హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలనుకోవడం మంచిదే అయితే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కోసం వైజాగ్ పోవాల్సివస్తుందన్నారు. అది అయ్యే పనికాదన్నారు. వికేంద్రీకరణ జరగాలన్నారు. సీఎం జగన్ గ్రామాల్లో వికేంద్రీకరణ చేసి లక్షాలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారని తెలిపారు. పట్టణాలకు పోవడం కష్టం కాబట్టి గ్రామాల్లోని వీటిని ఏర్పాటు చేశారు. కర్నూలులో రెండో రాజధాని ఏర్పాటు చేసి, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ పెట్టాలని తెలిపారు.

లెజిస్లేటివ్, జ్యుడీషయల్, అడ్మినిస్ట్రేటివ్ వేర్వేరు చోట్ల పెడితే ఇబ్బందులు వస్తాయని చెప్పారు. రాయలసీమ నుంచి అమరావతికి వెళ్లడమే కష్టమైనప్పుడు మళ్లీ వైజాగ్ కు వెళ్లడం అయ్యే పనికాదన్నారు. కర్నూలులో కేవలం హైకోర్టు ఏర్పాటు చేయడంతో ఒక శాతం ఉద్యోగులు, కొంతమంది ప్రజలకు లాభం చేకూరుతుందన్నారు. అసెంబ్లీ కూడా కర్నూలులో ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి పోతుంటారని చెప్పారు. అభివృద్ధి జరిగేందుకు వీలుంటుందన్నారు. కర్నూలులో సమ్మర్ కేపిటల్, వైజాగ్ లో వింటర్ కేపిటల్ పెట్టాలని సూచించారు.

తల ఒక దగ్గర, మొడెం మరొక దగ్గర, కాళ్లు ఇంకొక దగ్గర ఉంటే శరీరం నడవదని..మూడు ఒక చోట ఉంటేనే నడుస్తుందన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనే కమిటీ నిర్ణయానికి వస్తుందన్నారు. కర్నూలుకు హైకోర్టు వస్తుంది దాంట్లో అనుమానం లేదన్నారు. అంతకముందు టీడీపీ ప్రభుత్వం.. కర్నూలులో బెంచ్ ను డిక్లేరు చేసిందని తెలిపారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం దానికి గ్రేడ్ పెంచి హైకోర్టు పెడుతున్నారని…కొద్దిగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. 

ప్రభుత్వం ఏమాత్రం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదని…కర్నూలు, విశాఖలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని చెప్పారు. తమ అభిప్రాయాలు కూడా తీసుకోవాలని..ఓవర్ నైట్ నిర్ణయాలతో ఇబ్బందులొస్తాయన్నారు. కమిటీ నిర్ణయాలు ముఖ్యమంత్రి ఆలోచన నిర్ణయాలకే పరిమితం అవుతాయని చెప్పారు. రాయలసీమలో రాజధాని పెట్టాలని, సమ్మర్ కేపిటల్, వింటర్ కేపిటల్ వేరే దగ్గర పెట్టాలని రాయలసీమ హక్కుల ఐక్య వేదిక తరపున డిమాండ్ చేస్తూవస్తున్నామని తెలిపారు.