100-120 మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్ విడుదల..? రేపు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కీలక సమావేశం

తొలి జాబితాలో 100 నుంచి 120 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనుంది బీజేపీ.

100-120 మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్ విడుదల..? రేపు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కీలక సమావేశం

BJP MP Candidates

BJP MP Candidates : రేపు సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. లోక్ సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై సీఈసీ చర్చించనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, డాక్టర్ కె లక్ష్మణ్, వానతీ శ్రీనివాసన్, యడియూరప్ప, సర్బానంద సోనోవాల్, ఇక్బాల్ సింగ్ లాల్‌పురియా, సుధా యాదవ్, భూపేంద్ర యాదవ్, ఓం ప్రకాష్ మాథుర్, బీఎల్ సంతోశ్ సహా కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

తొలి జాబితాలో 100 నుంచి 120 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనుంది బీజేపీ. సీఈసీ ఖరారు చేసిన పేర్లకు బీజేపీ పార్లమెంటరి బోర్డు ఆమోదం తెలపనుంది.

2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన స్థానాలపై సీఈసీలో చర్చించే అవకాశం ఉంది. మొదటి జాబితాలో దక్షిణాది రాష్ట్రాల నుంచి అధిక స్థానాలను ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థులను ప్రకటించనుంది బీజేపీ. ఈ సాయంత్రం వివిధ రాష్ట్రాల లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కోర్ కమిటీ సమావేశం కానుంది.

హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీఎల్ సంతోష్, రాష్ట్ర అధికారులు, బీజేపీ ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్, అస్సాం, జార్ఖండ్ ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాల ఆఫీస్ బేరర్లు ఈ సమావేశంలో పాల్గొంటారు.

Also Read : కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు.. పార్టీని వీడుతున్న కీలక నాయకులు