Bjp Second List : లోక్‌సభ ఎన్నికలు.. బీజేపీ సెకండ్ లిస్ట్ రెడీ..!

గెలుపు అవకాశాలు, సామాజిక సమీకరణాలు, సర్వేలు, కొత్తగా పార్టీల చేరిన ప్రముఖుల ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేయనుంది కేంద్ర ఎన్నికల కమిటీ.

Bjp Second List : లోక్‌సభ ఎన్నికలు.. బీజేపీ సెకండ్ లిస్ట్ రెడీ..!

Bjp Second List Ready

Updated On : March 11, 2024 / 6:19 PM IST

Bjp Second List : పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. మరోసారి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. తెలంగాణ, కర్నాటక, గుజరాత్, పంజాబ్ సహా పలు రాష్ట్రాలలో లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకోనుంది. దాదాపు 150 స్థానాల అభ్యర్థులతో రెండవ జాబితా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇందుకోసం బీజేపీ అగ్రనాయకత్వం కసరత్తు చేస్తోంది. రెండో జాబితాలోనే తెలంగాణలో మిగిలిన 8 స్థానాలకు దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక ఏపీలో పొత్తులు ఖరారైన స్థానాలకు కూడా అభ్యర్థులను ఎంపిక చేయనుంది బీజేపీ.

ఏపీ, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, హర్యానా, ఒడిశా, బీహార్ సహా వివిధ రాష్ట్రాల్లో లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. గెలుపు అవకాశాలు, సామాజిక సమీకరణాలు, సర్వేలు, కొత్తగా పార్టీల చేరిన ప్రముఖుల ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేయనుంది కేంద్ర ఎన్నికల కమిటీ. ఇప్పటికే 195మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది బీజేపీ.

Also Read : ఈ రెండు స్థానాల్లో పోటీ చేయనున్న పవన్ కల్యాణ్?