Anil Deshmukh: ఏడాది అనంతరం జైలు నుంచి విడుదలైన మాజీ హోంమంత్రి.. ఓపెన్ టాప్ జీపులో ఊరేగించిన పార్టీ కార్యకర్తలు

వాస్తవానికి డిసెంబర్ 12వ తేదీన ఆయనకు జస్టిస్ ఎంఎస్ కార్నిక్ బెయిల్ బెయిల్ మంజూరు చేశారు. అయితే ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు సీబీఐ 10 రోజులు గడువు కోరింది. కోర్టుకు సెలవులు కావడంతో 2023 జనవరిలోనే ఈ పిటిషన్ విచారణకు వస్తుంది. ఈ నేపథ్యంలో తమకు మరికొంత వ్యవధి కావాలని కోర్టును సీబీఐ మంగళవారం కోరింది. దీనిపై దేశ్‌ముఖ్ తరపు న్యాయవాదులు తమ వాదన వినిపిస్తూ, ఎట్టిపరిస్థితుల్లోనూ బెయిలును మరోసారి పొడిగించేది లేదని..

Anil Deshmukh: ఏడాది అనంతరం జైలు నుంచి విడుదలైన మాజీ హోంమంత్రి.. ఓపెన్ టాప్ జీపులో ఊరేగించిన పార్టీ కార్యకర్తలు

Maharashtra Ex Minister, Out Of Jail, Visits Temple In Open-Top Jeep

Updated On : July 13, 2023 / 12:20 PM IST

Anil Deshmukh: ఏడాది జైలు జీవితం అనంతరం విడుదలైన మహారాష్ట్ర హోం శాఖ మాజీ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత అనిల్ దేశ్‌ముఖ్‌ బుధవారం విడుదలయ్యారు. ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న ఆయనకు బెయిల్ లభించడంతో బయటికి వచ్చారు. మనీ లాడరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడంతో నవంబర్ 2021 నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. హోం మంత్రిగా తనకున్న అధికారాన్ని దేశ్‌ముఖ్ దుర్వినియోగం చేశారని, కొందరు పోలీసు ఆఫీసర్ల ద్వారా ముంబైలోని బార్ల యజమానుల నుంచి 4.70 కోట్ల రూపాయలు వసూలు చేశారని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఆరోపింది.

Rajasthan: మనుస్మృతి దహనం చేశారని ముగ్గురు అరెస్ట్

వాస్తవానికి డిసెంబర్ 12వ తేదీన ఆయనకు జస్టిస్ ఎంఎస్ కార్నిక్ బెయిల్ బెయిల్ మంజూరు చేశారు. అయితే ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు సీబీఐ 10 రోజులు గడువు కోరింది. కోర్టుకు సెలవులు కావడంతో 2023 జనవరిలోనే ఈ పిటిషన్ విచారణకు వస్తుంది. ఈ నేపథ్యంలో తమకు మరికొంత వ్యవధి కావాలని కోర్టును సీబీఐ మంగళవారం కోరింది. దీనిపై దేశ్‌ముఖ్ తరపు న్యాయవాదులు తమ వాదన వినిపిస్తూ, ఎట్టిపరిస్థితుల్లోనూ బెయిలును మరోసారి పొడిగించేది లేదని, హైకోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని అన్నారు. వాదనలు విన్న అనంతరం బుధవారం కోర్టు తీర్పు వెలువరిస్తూ, తాము బెయిలు మంజూరు చేస్తూ ఇంతకుముందు ఇచ్చిన తీర్పుపై మరోసారి స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో దేశ్‌ముఖ్ విడుదలకు మార్గం సుగమం అయింది.

Controversies in India: 2022 కాంట్రవర్సీనామ సంవత్సరం.. ఈ ఏడాదిలో దేశాన్ని కుదిపివేసిన 5 ప్రధాన కాంట్రవర్సీలు

ఇక ఆయన విడుదల కావడంతో ఎన్సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద హడావుడి చేశారు. జైలుకు పెద్ద సంఖ్యలో చేరుకుని ఘన స్వాగతం పలికారు. ఆయనకు మద్దతుగా నినాదాలు చేస్తూ జైలు పరిసర ప్రాంతాల్ని హోరెత్తించారు. ఓపెన్ టాప్ జీపులో ఆయనను ఎక్కించి పెద్ద ర్యాలీ నడుమ నేరుగా గుడికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఆయన ఇంటికి చేరుకున్నారు.