బావ హరీశ్‌రావు త్వరగా కోలుకోవాలి : కేటీఆర్

  • Published By: sreehari ,Published On : September 5, 2020 / 06:58 PM IST
బావ హరీశ్‌రావు త్వరగా కోలుకోవాలి : కేటీఆర్

Updated On : September 5, 2020 / 7:34 PM IST

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు కరోనా పాజిటివ్ అని తేలింది. తాను కరోనా బారినపడిన విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కరోనా స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆయన కరోనా టెస్టులు చేయించుకున్నారు.



ఈ పరీక్షల్లో హరీశ్ రావుకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని ఆయన చెప్పారు. తనతో పాటు ఉన్నవారందరిని హోం ఐసోలేషన్ లో ఉండాలని సూచించారు. కరోనా పరీక్షలు కూడా చేయించు కోవాలని కోరారు.



కరోనా సోకిన విషయాన్ని హరీశ్ రావు ట్విట్టర్ ద్వారా తెలియజేయడంతో మంత్రి కేటీఆర్ స్పందించారు. తన బావ త్వరగా కోలుకోవాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఇతరుల కంటే హరీశ్ త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నానని చెప్పారు.