టికెట్ల లొల్లి : మంత్రి మల్లారెడ్డి డబ్బులు తీసుకున్నాడు..కార్యకర్త ఫోన్ కాల్ వైరల్

మేడ్చల్ జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల లొల్లి నెలకొంది. మాజీ ఎమ్మెల్యే, సిట్టింగ్ మంత్రిగా ఉన్న మల్లారెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఉద్యమకారులు టికెట్లు కావాలని మంత్రి మల్లారెడ్డిని కోరుతున్నారు. అయితే..ఓ కార్యకర్తతో మల్లారెడ్డి మాట్లాడిన ఫోన్ కాల్ కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. డబ్బులు డిమాండ్ చేసినట్లు, దీనికి సంబంధించిన వీడియో, ఆధారాలున్నాయని కార్యకర్త చెప్పడం సంచలనం సృష్టిస్తోంది.
సీఎం కేసీఆర్, కేటీఆర్ దగ్గరకు వెళ్లి అన్ని విషయాలు చెబుతానని కార్యకర్త రాపోలు రాములు స్పష్టం చేశారు. అయితే టికెట్ దక్కని వారు ఇలాంటి ఆరోపణలు చేయడం సహజమేనని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. టికెట్ల విషయంలో సర్వే చేయాలని చెప్పినా వినిపించుకోలేదన్నారు. ఒక నియంతలా మంత్రి మల్లారెడ్డి వ్యవహరిస్తున్నారని, బెదిరింపులకు దిగుతున్నాడని ఆరోపించారు.
10tvతో ఏం చెప్పారంటే
ఈ విషయంపై కార్యకర్త రాపోలు రాములుతో 10tv ఫోన్ లో 2020, జనవరి 16వ తేదీ గురువారం మాట్లాడింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినట్లు, కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఉద్యమంలో రూ. 80 లక్షల దాక ఖర్చు పెట్టినట్లు చెప్పారు. మున్సిపల్ ఎన్నికల విషయంలో..ఒక టికెట్ ఆశించినట్లు తెలిపారు.
ఒక్కో వ్యక్తి దగ్గర రూ. 50 లక్షలు మంత్రి మల్లారెడ్డి వసూలు చేశాడని ఆరోపించారు. న్యాయం చేస్తానని చెప్పి మోసం చేశారని వివరించారు. భూ కబ్జా దారులకు, ప్రజలను మోసం చేసిన వ్యక్తులకు మున్సిపల్ టికెట్లు ఇచ్చారని తెలిపారు. శరణం గచ్చామి సినిమా తీసిన మురళి దగ్గర రూ. 50 లక్షలు ఇవ్వాలని మంత్రి మల్లారెడ్డి అడిగారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై మంత్రి మల్లారెడ్డి ఎలా రియాక్షన్ అవుతారో చూడాలి.
Read More : ఎందుకోసం : స్వరం మార్చిన పవన్ కళ్యాణ్