వైసీపీ నాయకులు ఆస్తులు అమ్ముకుంటున్నారు- సొంత ప్రభుత్వంపైనే ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

వైసీపీ నేతలు, కాంట్రాక్టర్లు తీవ్రంగా నష్టపోతున్నారు, వారంతా రోజూ నా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని ఆయన వాపోయారు.

వైసీపీ నాయకులు ఆస్తులు అమ్ముకుంటున్నారు- సొంత ప్రభుత్వంపైనే ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Vasantha Venkata Krishna Prasad Sensational Comments

Updated On : January 24, 2024 / 12:53 AM IST

Vasantha Venkata Krishna Prasad : సొంత ప్రభుత్వంపైనే మరోసారి వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. సంక్షేమంతో పోల్చుకుంటే అభివృద్ధిలో పోటీ పడలేకపోతున్నామన్నారు. ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు రాక వైసీపీ నాయకులు ఆస్తులు అమ్ముకుంటున్నారని ఆయన అన్నారు. తన భవిష్యత్తు ఏంటన్నది కాలమే నిర్ణయిస్తుందన్నారు వసంత కృష్ణ ప్రసాద్.

Also Read : టీడీపీ-జనసేన కూటమిలోకి కమలం పార్టీ! బీజేపీకి కేటాయించే ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు ఇవే?

అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. బిల్లులు రాక చాలామంది వైసీపీ నేతలు, కాంట్రాక్టర్లు తీవ్రంగా నష్టపోతున్నారు, వారంతా రోజూ నా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని ఆయన వాపోయారు. మొదటి మూడేళ్లు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, వాటికి సంబంధించిన బిల్లులు ఏవీ రాక గడిచిన ఏడాదిన్నరగా నేను ఎలాంటి నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేయలేదు అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారాయన.

దీనికి తోడు తన భవిష్యత్తు ఏంటన్నది కాలమే నిర్ణయిస్తుంది అంటూ వసంత కృష్ణ ప్రసాద్ చేసిన కామెంట్స్ ఎన్టీఆర్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. చాలా రోజులుగా వసంత కృష్ణ ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రి జోగి రమేశ్ తో ఆయనకు విబేధాలు ఉన్నాయి. ఇక, టికెట్ అంశానికి సంబంధించి సీఎం జగన్ ను అనేకసార్లు కలిశారు.

Also Read : వైఎస్‌ కుటుంబంలో రాజకీయ యుద్ధం.. షర్మిలతో జగన్‌కు చిక్కులు తప్పవా?

మొత్తంగా బిల్లులు రాక వైసీపీ నేతలు ఆస్తులు అమ్ముకుంటున్నారు, కాలమే నా భవిష్యత్తును నిర్ణయిస్తుంది అంటూ వసంత కృష్ణ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ శ్రేణుల్లో చర్చకు దారితీశాయి. కాగా, వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీని వీడి మరో పార్టీలో చేరతారని కొంతకాలం ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చేలా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.