మున్సిపోల్స్ ఫలితాలు : ముందు జాగ్రత్తగా కర్నాటక, గోవాకు గెలుపు గుర్రాలు తరలింపు

కాసేపట్లో కౌంటింగ్‌.. రిజల్ట్ మాట ఎలా ఉన్నా.. మున్సిపల్ పీఠాలను దక్కించుకునేందుకు పార్టీలు అప్పుడే కసరత్తు మొదలెట్టాయి. గెలుపు గుర్రాలను శిబిరాలకు తరలించడం..

  • Published By: veegamteam ,Published On : January 25, 2020 / 01:32 AM IST
మున్సిపోల్స్ ఫలితాలు : ముందు జాగ్రత్తగా కర్నాటక, గోవాకు గెలుపు గుర్రాలు తరలింపు

Updated On : January 25, 2020 / 1:32 AM IST

కాసేపట్లో కౌంటింగ్‌.. రిజల్ట్ మాట ఎలా ఉన్నా.. మున్సిపల్ పీఠాలను దక్కించుకునేందుకు పార్టీలు అప్పుడే కసరత్తు మొదలెట్టాయి. గెలుపు గుర్రాలను శిబిరాలకు తరలించడం..

కాసేపట్లో కౌంటింగ్‌.. రిజల్ట్ మాట ఎలా ఉన్నా.. మున్సిపల్ పీఠాలను దక్కించుకునేందుకు పార్టీలు అప్పుడే కసరత్తు మొదలెట్టాయి. గెలుపు గుర్రాలను శిబిరాలకు తరలించడం.. మేయర్‌, చైర్మన్ స్థానాలను కైవసం చేసుకోవడంపై ఫోకస్ పెట్టాయి. తెలంగాణలో క్యాంప్‌ పాలిటిక్స్‌ కాక పెంచుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఇప్పుడెక్కడా కనిపించడం లేదు. వాళ్లందర్నీ ఇప్పటికే క్యాంప్‌లకు తరలించాయి రాజకీయ పార్టీలు. మేయర్‌, చైర్మన్‌ ఎన్నికల వరకు వాళ్లంతా పార్టీ ఏర్పాటు చేసిన శిబిరాలకే పరిమితం కానున్నారు.

 

2

కర్నాటక, మహారాష్ట్ర, గోవాకు షిఫ్ట్:
ఉదయం 8గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్‌ మధ్యాహ్నం కల్లా పూర్తి కానుంది. కార్పొరేషన్‌, మున్సిపాల్టీల్లో గెలుపుపై ధీమాగా ఉంది అధికార టీఆర్‌ఎస్‌. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా అభ్యర్థులను క్యాంప్‌కు తరలించింది. పలువురు ఎమ్మెల్యేలు మున్సిపాలిటీల్లో తమ అభ్యర్థులను కర్నాటక, మహారాష్ట్ర, గోవాకు షిప్ట్ చేశారు. ఆయా నియోజకవర్గాల్లో గెలుపును తమ ఖాతాలో ఎలా వేసుకోవాలి.. అందుకు అనుసరించాల్సిన వ్యూహాలను సిద్ధం చేసుకున్నారు. స్పాట్..

1

27న మేయర్‌, చైర్మన్ల ఎన్నిక:
ఈ నెల 27న కొత్తగా ఎన్నికైన అభ్యర్థుల ప్రమాణస్వీకారం ఉంటుంది. అదే రోజు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌ల ఎన్నిక జరగనుంది. దీంతో నాలుగైదు రోజుల పాటు అభ్యర్థులు క్యాంప్‌లకే పరిమితం అయ్యేలా ఎమ్మెల్యేలు హై ఫై సౌకర్యాలు చేపట్టారు. కౌంటింగ్ తర్వాత కొన్ని చోట్ల రెబల్స్, మరికొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధిస్తే వారి మద్దతు పొందేందుకు తీసుకోవాల్సిన వ్యూహాలను ముందే రచించుకున్నారు. అలాంటి వారిని వెంటనే శిబిరాలకు తరలించాలని డిసైడ్ అయ్యారు.

pooss

ఎమ్మెల్సీలు, ఎంపీలతో కేటీఆర్‌ భేటీ:
ఇక మేయర్‌, చైర్మన్‌ రేసులో ముందుండే వాళ్లు గెలిచిన అభ్యర్థుల్ని తమవైపు తిప్పుకునే బాధ్యతల్ని తీసుకుంటున్నారు. మరోవైపు కౌంటింగ్‌ తర్వాత ఎమ్మెల్సీలు, ఎంపీలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ప్రగతిభవన్‌లో భేటీకానున్నారు. ఎమ్మెల్సీలు, ఎంపీల ఓట్లతో విజయం సాధించే స్థానాలకు ఓట్లను ఖరారు చేయనున్నారు. మరోవైపు మేయర్, చైర్మన్ ఎన్నికలు పూర్తయ్యే వరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సమన్వయకర్తలు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించనున్నారు.

* క్యాంప్‌లకు కార్పొరేషన్, మున్సిపాలిటీ అభ్యర్థులు
* కర్నాటక, మహారాష్ట్ర, గోవాకు అభ్యర్థుల తరలింపు
* రెబల్‌, స్వతంత్ర అభ్యర్థులపై ఫోకస్ పెట్టిన ఎమ్మెల్యేలు
* ప్రగతి భవన్‌ నుంచి కేటీఆర్ ఫలితాలపై పర్యవేక్షణ
* టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు, ఎంపీలతో కేటీఆర్ భేటీ