టీడీపీలోకి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు.. చేరికకు ముహూర్తం ఫిక్స్
టీడీపీలో చేరికల సందడి నెలకొంది. పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు, పలువురు కీలక నాయకులు టీడీపీలో చేరారు.

Sri Krishna Devarayalu Lavu
Sri Krishna Devarayalu Lavu : నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. టీడీపీలో చేరికకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు ఎంపీ లావు. ఈ నెల 22న ఆయన తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.
చంద్రబాబు నివాసానికి వెళ్లిన ఎంపీ లావు.. చంద్రబాబుతో భేటీ అయ్యారు. టీడీపీలో చేరిక అంశంపై చర్చించారు. ఇప్పటికే ఎంపీ లావు టీడీపీలో చేరడం ఖాయమే అయినా.. ఇంతవరకు డేట్ అయితే ఫిక్స్ కాలేదు. తాజాగా ఆ ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈ నెల 22న మంచి రోజు అని, ఆ రోజే టీడీపీలో చేరాలని ఎంపీ లావు నిర్ణయించారు. టీడీపీలో చేరికకు చంద్రబాబు పర్మిషన్ కోసం ఎంపీ లావు వచ్చినట్లు ఆయన అనుచరులు చెప్పారు.
Also Read : 4 దశాబ్దాల చరిత్రలో తొలిసారి.. రాజ్యసభ ఎన్నికల నుంచి టీడీపీ నిష్క్రమణ..
నరసరావుపేట ఎంపీ టికెట్ ఇచ్చేందుకు సీఎం జగన్ నిరాకరించడంతో.. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి రాజీనామా చేశారు. దాంతో పాటు ఎంపీ పదవికి కూడా రిజైన్ చేశారు. టీడీపీలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నారు.
టీడీపీలో చేరికల సందడి
మరోవైపు చంద్రబాబు ఇంటి వద్ద చేరికల సందడి నెలకొంది. టీడీపీలో చేరేందుకు పల్నాడు నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. అద్దంకి వైసీపీ నేత బాచిన ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీలో చేరింది. బాచిన గరటయ్య, కృష్ణ చైతన్యలకు పార్టీ కండువా కప్పారు చంద్రబాబు. బాలినేని ముఖ్య అనుచరుడు అట్లా చిన వెంకట రెడ్డి, అనుచరులు చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కారు.
అట్లా చిన వెంకట రెడ్డి చేరిక నరసరావుపేట నియోజకవర్గంలో కీలకం కానుంది. బాచిన, అట్లా చిన వెంకట రెడ్డి చేరికల కార్యక్రమానికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, యరపతినేని, జీవీ ఆంజనేయులు తదితరులు హాజరయ్యారు. ఆళ్లగడ్డ, కోవూరు, కదిరి సెగ్మెంట్లకు చెందిన వైసీపీ నేతలు సైతం టీడీపీలో చేరారు.
Also Read : ఏపీని షేక్ చేస్తున్న నెల్లూరు పెద్దారెడ్ల పొలిటికల్ ఇష్యూస్