కొత్త డిమాండ్ : ఏపీ రాజధానిగా విశాఖ
ఏపీ రాజధాని అంశంపై రగడ కంటిన్యూ అవుతోంది. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తారా లేక తరలిస్తారా అనే దానిపై స్పష్టత లేదు. రాజధాని గురించి రోజుకో వార్త ప్రచారంలోకి

ఏపీ రాజధాని అంశంపై రగడ కంటిన్యూ అవుతోంది. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తారా లేక తరలిస్తారా అనే దానిపై స్పష్టత లేదు. రాజధాని గురించి రోజుకో వార్త ప్రచారంలోకి
ఏపీ రాజధాని అంశంపై రగడ కంటిన్యూ అవుతోంది. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తారా లేక తరలిస్తారా అనే దానిపై స్పష్టత లేదు. రాజధాని గురించి రోజుకో వార్త ప్రచారంలోకి వస్తోంది. వైసీపీ ప్రభుత్వం రాజధానిని తరలిస్తుందని వార్తలు వస్తున్నాయి. మంత్రులు చేస్తున్న ప్రకటనలు రాజధాని రైతుల్లో ఆందోళన నింపాయి. రాజధానిని తరలిస్తే ఊరుకునేది లేదని టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు హెచ్చరిస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. తెరపైకి కొత్త డిమాండ్లు, ప్రతిపాదనలు వస్తున్నాయి. తమ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజధాని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయనగరంలో మీడియాతో ఆయన మాట్లాడారు. రాజధానిపై 5 కోట్ల ఆంధ్రులు గందరగోళంలో ఉన్నారని చెప్పారు. ఆరేళ్ల తర్వాత కూడా రాజధానిపై చర్చ జరగడం దురదృష్టకరం అని వాపోయారు. రాజధాని అమరావతిలో లేదన్నట్లుగా మంత్రి బొత్స సంకేతాలిస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి నాలుగు రాజధానులు అంటూ బీజేపీ నేత టీజీ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి, విశాఖ అంటూ కొందరు మేధావులు మాట్లాడుతున్నారని, ఇది మరో ఉద్యమంగా మారే అవకాశం ఉందని ఆయన గంటా హెచ్చరించారు.
సెప్టెంబర్ 4న కేబినెట్ మీటింగ్ లో రాజధానిపై సీఎం జగన్ స్పష్టత ఇవ్వాలని గంటా డిమాండ్ చేశారు. లేకపోతే విశాఖను రాజధాని చెయ్యాలనే ఉద్యమం ప్రారంభమయ్యే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చారు. శివరామకృష్ణ రిపోర్టు ప్రకారమే అమరావతిని ఏపీ రాజధానిగా టీడీపీ ప్రభుత్వం ఎంపిక చేసిందని గంటా గుర్తు చేశారు. తేనె తుట్టని కదిపినట్టుగా మంత్రి బొత్స రాజధాని అంశాన్ని కదిపారని గంటా సీరియస్ అయ్యారు. రాజధానిపై ప్రజలకు స్పష్టత ఇవ్వకపోడం సరికాదన్న గంటా.. సీఎం జగన్ స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలన్నారు.