అమరావతికి ఎలాంటి నష్టం జరుగదు : ఎమ్మెల్యే రోజా

ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమవ్వడం వల్లే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు వచ్చాయని వైసీపీ ఎమ్మెల్యే రోజా తెలిపారు.

  • Published By: veegamteam ,Published On : December 21, 2019 / 10:59 AM IST
అమరావతికి ఎలాంటి నష్టం జరుగదు : ఎమ్మెల్యే రోజా

Updated On : December 21, 2019 / 10:59 AM IST

ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమవ్వడం వల్లే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు వచ్చాయని వైసీపీ ఎమ్మెల్యే రోజా తెలిపారు.

ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమవ్వడం వల్లే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు వచ్చాయని వైసీపీ ఎమ్మెల్యే రోజా తెలిపారు. శనివారం (డిసెంబర్ 21, 2019) తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ  అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందన్నారు. అమరావతిలో రాజ్ భవన్, అసెంబ్లీ, ఎడ్యుకేషన్ హబ్, ఎయిమ్స్ ఉంటుందని అన్నారు. అమరాతికి ఎలాంటి నష్టం జరుగదన్నారు. కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు చేయాలని శ్రీబాగ్ ఒడంబడికలోనే ఉందని గుర్తు చేశారు. 

గతంలో నష్టపోయినట్లు భవిష్యత్ లో నష్టపోకూడదని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నారు. వైజాగ్ లో సెక్రటేరియట్, క్యాంప్ ఆఫీస్ పెట్టాలని అక్కడున్న ప్రాంతాన్ని కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలని సీఎం జగన్ ఆలోచన అన్నారు. అమరావతిలో ఏదో నష్టమైపోతుందని టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

రాజధాని అధ్యయనంపై ఏర్పాటైన నిపుణుల కమిటీ కన్వీనర్ జీఎన్ రావు.. జగన్ ఆశించినట్లుగా పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానుల ప్రతిపాదనకు మొగ్గుచూపారు. ఏపీ రాజధాని అంశంపై సీఎం జగన్ కు జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చింది. సీఎంకు ఇచ్చిన నివేదికలో చేసిన సూచనలను, సిఫార్సులను కమిటీ సభ్యులు మీడియాకు వివరించారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని తాము నివేదికలో సూచించామని కమిటీ సభ్యులు తెలిపారు. 

విశాఖలో సీఎంవో, సచివాలయం, వేసవి అసెంబ్లీ, హైకోర్టు బెంచ్.. అమరావతిలో అసెంబ్లీ, రాజ్ భవన్, మంత్రుల క్వార్టర్స్, హైకోర్టు బెంచ్, సీఎం క్యాంప్ ఆఫీస్.. కర్నూలులో హైకోర్టు, సీఎం క్యాంప్ ఆఫీస్, శీతాకాల అసెంబ్లీ ఏర్పాటు చేయాలని నివేదికలో సూచించామన్నారు. అంతేకాదు.. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రాన్ని 4 రీజియన్ లుగా విభజించాలని తాము సిఫార్సు చేసినట్టు కమిటీ సభ్యులు వివరించారు. ఉత్తర, మధ్య, దక్షిణ కోస్తా, రాయలసీమ రీజియన్ లుగా రాష్ట్రాన్ని విభజించాలని కోరామన్నారు.