Maharashtra Politics: ప్రతిపక్ష నేత పదవి ఒద్దట, పార్టీ పదవి కావాలట.. అజిత్ పవార్ వ్యాఖ్యల వెనుక మతలబు ఏంటి?

ముంబైలో జరిగిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 24వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో పవార్ ఈ డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. "ప్రతిపక్ష నాయకుడిగా కఠినంగా వ్యవహరించనని నాకు చెప్పారు. కానీ నాకు ఈ పదవిపై ఎప్పుడూ ఆసక్తి లేదు. కానీ పార్టీ ఎమ్మెల్యేల డిమాండ్ వల్ల ఆ పాత్రను అంగీకరించాల్సి వచ్చింది

Maharashtra Politics: ప్రతిపక్ష నేత పదవి ఒద్దట, పార్టీ పదవి కావాలట.. అజిత్ పవార్ వ్యాఖ్యల వెనుక మతలబు ఏంటి?

Ajit Pawar

Updated On : June 21, 2023 / 9:08 PM IST

Ajit Pawar: కొద్ది రోజుల క్రితం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా చేయగానే తదుపరి అధినేత ఆ పార్టీ సీనియర్ నేత అజిత్ పవారే అంటూ వార్తలు గుప్పుమన్నాయి. పవార్ రాజీనామాను పార్టీలో ఉన్నవారంతా వ్యతిరేకించినప్పటికీ అజిత్ పవార్ మాత్రం ఎలాంటి కామెంట్ చేయలేదు. ఇక పవార్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న అనంతరం, తన కూతురు సుప్రియా సూలే సహా మరికొందరికి పార్టీ పదవులు ఇచ్చారు. కానీ అజిత్ పవార్‭కు మాత్రం ఎలాంటి పదవి ఇవ్వలేదు.

Goa G20 Meet: గోవా జీ-20 సమావేశాలు.. అమెరికా నుంచి కీలక సందేశం ఇచ్చిన ప్రధాని మోదీ

దీంతో అజిత్ అసంతృప్తికి గురయ్యారని వార్తలు వచ్చాయి. అలాంటిదేమీ లేదని స్వయంగా ఆయనే వివరణ ఇచ్చినప్పటికీ.. తాజాగా చేసిన ప్రకటన చూస్తే అసంతృప్తి నిజమేనని అనిపిస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీ విపక్ష నేతగా ఉన్న అజిత్ పవార్.. తనను మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి బాధ్యతల నుంచి తప్పించాలని బహిరంగంగా కోరారు. అంతటితో ఆగక, పార్టీలో తనకు ఎలాంటి పాత్రనైనా కేటాయించాలని బుధవారం పార్టీ నాయకత్వానికి అజిత్ పవార్ విజ్ఞప్తి చేశారు.

2024 Eelctions: మిత్రపక్షాలపై కాంగ్రెస్ పెత్తనం.. 9-4-1 ఫార్ములాతో పోటీకి హస్తం పార్టీ వ్యూహాలు

ముంబైలో జరిగిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 24వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో పవార్ ఈ డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. “ప్రతిపక్ష నాయకుడిగా కఠినంగా వ్యవహరించనని నాకు చెప్పారు. కానీ నాకు ఈ పదవిపై ఎప్పుడూ ఆసక్తి లేదు. కానీ పార్టీ ఎమ్మెల్యేల డిమాండ్ వల్ల ఆ పాత్రను అంగీకరించాల్సి వచ్చింది. పార్టీ సంస్థలో నాకు ఏదైనా పదవిని కేటాయించండి. నాకు అప్పగించిన ఏ బాధ్యతకైనా నేను పూర్తి న్యాయం చేస్తాను” అని అజిత్ పవార్ అన్నారు. అయితే తాను తాజాగా చేసిన డిమాండ్‌పై ఎన్సీపీ నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు.

9th Yoga Day Event: కాపీరైట్లు లేవు, పేటెంట్లు లేవు, అందరికీ ఉచితం.. ఐరాసా నుంచి ప్రపంచానికి మోదీ ‘యోగా డే’ సందేశం

శివసేనలో తిరుగుబాటు కారణంగా మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం కూలిపోవడంతో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అజిత్ పవార్ గత జూలైలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టారు. ఇక కొద్ది రోజుల క్రితం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తన కుమార్తె, ఎంపీ అయిన సుప్రియా సూలేను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడంతో పాటు మహారాష్ట్ర బాధ్యతలు అప్పగించారు. ఆమెతో పాటు ప్రఫుల్ పటేల్‭ను కూడా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. కానీ అజిత్ పవార్‭కు మాత్రం ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదు. ఇక కొద్ది రోజుల ముందు తానకు ముఖ్యమంత్రి అవ్వాలని ఉందంటూ అజిత్ పవార్ వ్యాఖ్యానించడం గుర్తుండే ఉంటుంది.